విజయవాడ:కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. తండ్రి కోసం ఎదురు చూస్తున్న బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. బాలికను గుర్తించిన పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

also read:నగ్నంగా డ్యాన్స్: బర్త్‌డే వేడుకలో డ్యాన్సర్‌కు చిత్రహింసలు

విజయవాడలో బుధవారం నాడు రాత్రి తండ్రి కోసం ఎదురుచూస్తున్న బాలికను గుర్తు తెలియని దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also read:భర్త బతికుండగానే ప్రియుడితో పెళ్లి చివరికిలా..

బాలికను నూజివీడు ట్రిపుల్ ఐటీ భవనం వెనుక భాగంలో వదిలి వెళ్లాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు బాలికను గుర్తించారు. రాత్రిపూట బాలిక ఇక్కడ ఎందుకు ఉందనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారు. 

దీంతో పోలీసులకు బాలిక అసలు విషయం చెప్పింది. బాలికను చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.