హైదరాబాద్: హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకొంది. పుట్టిన రోజు వేడుకల్లో  నగ్నంగా  డ్యాన్స్ చేయాలని మహిళలను వేధింపులకు పాల్పడ్డారు. అలా చేయనందుకు  ఒక రూమ్‌లో బంధించి  మహిళలను చిత్రహింసలు పెట్టారు. 

also read:స్టూడెంట్ సంధ్య సూసైడ్: మార్చురీ తలుపులు ధ్వంసం, కాలితో తన్నిన కానిస్టేబుల్

హైద్రాబాద్ రాజేంద్రనగర్‌ పట్టణంలో బర్త్‌డే వేడుకల్లో డ్యాన్స్  కోసం  ఓ మహిళను కత్తులతో బెదిరించారు. ఈవెంట్ ఆర్గనైజర్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు. మద్యం మత్తులో మహిళను కత్తులతో బెదిరించారు నిందితులు. 

బర్త్ డే వేడుకల్లో నగ్నంగా డ్యాన్స్ చేయాలని  నలుగురు వ్యక్తులు  బెదిరింపులకు పాల్పడ్డారు. బుధవారం నాడు ఉదయం మహిళ తప్పించుకొంది. ఈ విషయమై బాధితురాలు   పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అమీర్ అలీ, సుల్తాన్, సలీమ్ తో పాటు మరో వ్యక్తి బెదరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.