Asianet News TeluguAsianet News Telugu

కిడారి శ్రావణ్‌ను అభినందించిన మంత్రులు

ప్రాథమిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్ కుమార్‌ను పలువురు మంత్రులు అభినందించారు

ministers appreciates kidari sravan kumar
Author
Amaravathi, First Published Nov 16, 2018, 6:21 PM IST


అమరావతి: ప్రాథమిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్ కుమార్‌ను పలువురు మంత్రులు అభినందించారు. శుక్రవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో  మంత్రులు చినరాజప్ప, నారాలోకేష్, భూమా అఖిల ప్రియ, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ వైద్య ఆరోగ్య ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య కలిసి అభినందనలు తెలిపారు.

కొత్తగా బాద్యతలు స్వీకరించిన సందర్బంగా మంత్రి నారాలోకేష్ శ్రావణ్‌ను కలిసి మాట్లాడుతూ చైనా పర్యటన ముందు అసెంబ్లీ సమావేశాల సమయంలో కిడారి సర్వేశ్వరరావుతో   నియోజకవర్గం అభివృద్ది పనులపై మాట్లాడుతూ కలిసి భోజనం చేశానని గుర్తుచేసుకున్నారు. శాఖ పరంగా, నియోజకవర్గ అభివృద్దికి సహకారం కావాలని శ్రావణ్ కుమార్ కోరగా మంత్రులందరి సహకారం ఎప్పుడూ ఉంటుందని హామి ఇచ్చినట్టు ఆయన ప్రస్తావించారు.

శ్రావణ్ కుటుంబ సభ్యుల  గురించి  లోకేష్ శ్రావణ్‌ను అడిగి తెలుసుకున్నారు. అరకు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంబించాలని శ్రావణ్ కుమార్ లోకేష్ ను కోరగా డీపీఆర్‌లు సిద్దం చేశామని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. నిమ్మకూరును యూజీడి క్రింద రాష్ట్రంలోని ఒక మోడల్‌గా అభివృద్ది చేశామన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీ శాఖలు సమన్వయంతో పనిచేయడం వలన రాష్ట్రంలో మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టినట్లు లోకేష్ పేర్కొన్నారు.  మలేరియా జ్వరాల అధ్యయనానికి పూనం మాలకొండయ్య అధ్యక్షతన ఒక కమిటీ శ్రీలంకలో పర్యటించినట్టు చెప్పారు. జ్వరాలు తగ్గుముఖం పట్టాలంటే ప్రజలల్లో మార్పు తీసుకురావాలని, వారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 

రాబోయే 45రోజుల్లో పంచాయితీ రాజ్  శాఖలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తిచేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ వ్యాఖ్యనించారు.
వైద్య ఆరోగ్యశాఖలో అమలవుతున్న పథకాలు, గత నాలుగున్నర ఏళ్లల్లో శాఖలో జరిగిన అభివృద్ధి గురించి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి  పూనం మాలకొండయ్య మంత్రులకు వివరించారు.
ముంబై కి చెందిన ప్రఖ్యత లీలావతి ఆసుపత్రిని త్వరలో అమరావతిలో ప్రారంభించనునట్లు లోకేష్ మంత్రి శ్రావణ్‌కు తెలిపారు. 

త్వరలో మరో 5 ప్రముఖ ఆసుపత్రులు  అమరావతి రాజధానికి తరలి రానున్నట్లు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు.అరకు ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ మరింత అభివృద్ది చేయాలని మంత్రి శ్రావణ్ కుమార్ పర్యటక శాఖ మంత్రి అఖిల ప్రియను  కోరగా ఎవరైనా ముందుకు వస్తే పీపీపీ పద్దతిలో పర్యాటకంగా అరకును ఇంకా అభివృద్ది చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

బాబు కేబినెట్లోకి ఫరూక్, శ్రవణ్‌లు: భావోద్వేగానికి గురైన శ్రవణ్ తల్లి

1981‌లోనే సైకిల్ గుర్తుపై ఫరూక్ పోటీ: 35 ఏళ్లుగా టీడీపీతో అనుబంధం

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

అరకు నుంచి అమాత్యుడిగా కిడారి శ్రవణ్

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్య సీక్రెట్ భేటీ

చంద్రబాబుతో దోస్తీపై గుర్రు: కాంగ్రెసుకు చిరంజీవి రాంరాం

నాకు మంత్రి పదవి కావాలి.. ఎమ్మెల్యే చాంద్ బాషా

చంద్రబాబు కొలువులో అఖిలప్రియ కన్నా చిన్న మంత్రి

చిన్నోడివైనా అవకాశం ఇచ్చా, మంచి పేరు తీసుకురా:శ్రవణ్ తో చంద్రబాబు

గవర్నర్ ఒప్పుకోరనుకున్నారేమో,అందుకే విప్:చాంద్ భాషా

మంత్రి పదవి ఆశించా, కౌన్సిల్ చైర్మన్ అయినా ఒకే:షరీఫ్

మంత్రివర్గంలో మైనార్టీలకు చోటుపై చంద్రబాబు వివరణ

 

Follow Us:
Download App:
  • android
  • ios