అమరావతి:  టీడీపీ మైనార్టీ నేతలు, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో  ఏపీ  సీఎం చంద్రబాబునాయుడు శనివారం నాడు సమావేశమయ్యారు. మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు కల్పించే విషయంతో పాటు  జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. 

ఏపీ మంత్రివర్గాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం నాడు విస్తరించనున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుండి  కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. మైనార్టీల నుండి మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు స్థానం కల్పిస్తారు.

మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని  బాబు భావించారు. అయితే మంత్రివర్గ విస్తరణ ఏ ఏ కారణాలతో ఆలస్యమైందనే  విషయమై బాబు  మైనార్టీ నేతలకు వివరించారు.

అదే విధంగా మంత్రి పదవులు ఆశించిన  మైనార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడ  భవిష్యత్తులో  మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.  మంత్రివర్గంలోకి తొలుత షరీఫ్‌ను తీసుకోవాలని  చంద్రబాబునాయుడు భావించారు. అయితే  రాయలసీమ ప్రాంతం నుండి  మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ప్రయోజనమని భావించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో  చంద్రబాబునాయుడు  షరీఫ్ బదులుగా చంద్రబాబునాయుడు  ఎన్ఎండీ ఫరూక్‌కు మంత్రి పదవిని కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారు.  శాసనమండలి ఛైర్మెన్‌గా ఎన్ఎండీ షరీఫ్‌కు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.

చాంద్ బాషాకు విఫ్ పదవి లభిస్తోందా... మరే ఇతర పదవిని కేటాయిస్తారా అనే విషయమై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మోడీకి వ్యతిరేకంగా దేశంలో టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాన్ని చేయాలని భావిస్తోంది. ఈ పోరాటంలో ముస్లింలను కూడ పెద్ద ఎత్తున  తీసుకెళ్లాలని బాబు భావిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్