అరకు: అరకులో ఒక ఎస్టీ కుటుంబంలో జన్మించాడు. తండ్రి చాటు తనయుడిగా పేర్గాంచాడు. వారణాసి ఐఐటీలో బీటెక్ పూర్తి చేసి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనే అరకులో పుట్టి అమాత్యుడిగా రికార్డు సృష్టించబోతున్న కిడారి శ్రవణ్ కుమార్. 

ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కిడారి శ్రవణ్ కుమార్ నేపథ్యం ఓసారి చూద్దాం. అరకు దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు పెద్దకుమారుడు కిడారి శ్రవణ్ కుమార్. శ్రవణ్ 1990 జూన్ 14న జన్మించారు. 

ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంటే ఒకటి నుంచి 8వ తరగతి వరకు విశాఖపట్నం జిల్లా పెదబయలు సెయింట్ ఆన్స్ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత 9, 10 తరగతులు విజయనగరం జిల్లా పార్వతీపురంలోని స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చదివారు. విశాఖపట్నంలోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం వారణాసి ఐఐటీలో మెటలార్జీ పూర్తి చేశారు. 

మెటలార్జీ పూర్తి చేసిన శ్రవణ్ కుమార్ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. అందులో భాగంగా ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నారు. ఆ సమయంలో మావోయిస్టుల చేతిలో తండ్రి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురవ్వడంతో ఆయన ఢిల్లీ నుంచి అరకు చేరుకున్నారు. 

తండ్రి మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న కిడారి శ్రవణ్ కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కిడారి సర్వేశ్వరరావు కుటుంబం రాజకీయ ఎదుగుదల బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా పెద్దకుమారుడు శ్రవణ్ ను ఏపీ కేబినేట్ లో తీసుకోబోతున్నారు.  

చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన తర్వాత శ్రవణ్ కుమార్ తన తండ్రి కిడారి సర్వేశ్వరరావు అడుగుజాడలలో పయనిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇకపోతే మంత్రివర్గ విస్తరణలో భాగంగా గిరిజన కోటాలో శ్రవణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో శ్రవణ్ కు ఏపీ కేబినేట్ లో బెర్త్ కన్ఫమ్ చేశారు. 

ఇకపోతే తండ్రి మరణానంతరం మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో కిడారి శ్రవణ్ కుమార్ ఒకరు. ఇటీవలే భూమా నాగిరెడ్డి మరణానంతరం ఆయన కుమార్తె భూమా అఖిల ప్రియను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. అదే తరహాలో శ్రవణ్ కు కూడా అవకాశం కల్పించారు. 

ఇకపోతే శ్రవణ్ కుమార్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుత ఏపీ కేబినేట్ లో అతి పిన్న వయస్కుడు కావడం గమనార్హం. ఇప్పటి వరకు భూమా అఖిలప్రియ అతి చిన్న వయస్కురాలు కాగా ఇప్పుడు శ్రవణ్ అతి చిన్న వయస్కుడిగా చరిత్రగాంచాడు. భూమా అఖిలప్రియ 1989లో జన్మించగా, శ్రవణ్ కుమార్ 1990లో జన్మించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్య సీక్రెట్ భేటీ

చంద్రబాబుతో దోస్తీపై గుర్రు: కాంగ్రెసుకు చిరంజీవి రాంరాం

నాకు మంత్రి పదవి కావాలి.. ఎమ్మెల్యే చాంద్ బాషా

చంద్రబాబు కొలువులో అఖిలప్రియ కన్నా చిన్న మంత్రి

చిన్నోడివైనా అవకాశం ఇచ్చా, మంచి పేరు తీసుకురా:శ్రవణ్ తో చంద్రబాబు

గవర్నర్ ఒప్పుకోరనుకున్నారేమో,అందుకే విప్:చాంద్ భాషా

మంత్రి పదవి ఆశించా, కౌన్సిల్ చైర్మన్ అయినా ఒకే:షరీఫ్

మంత్రివర్గంలో మైనార్టీలకు చోటుపై చంద్రబాబు వివరణ