అమరావతి: టీడీపీ ఆవిర్భావానికి ముందు నుండే ఎన్ఎండీ ఫరూక్‌కు సైకిల్ గుర్తుతో అనుబంధం ఉంది. 1981లో  నంద్యాల చాంద్‌బడా వార్డు నుండి మున్సిపల్ కౌన్సిలర్‌‌గా ఫరూక్‌ ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో  సైకిల్ గుర్తుపైనే  ఫరూక్ పోటీ చేసి విజయం సాధించారు.1982 లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించడంతో  ఫరూక్ టీడీపీలో చేరారు.  టీడీపీ ఆవిర్భావం నుండి ఫరూక్ టీడీపీలోనే కొనసాగుతున్నారు.

నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి 1983 లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం. సంజీవరెడ్డి విజయం కోసం కృషి చేశారు. ఆ సమయంలో ఫరూక్ నంద్యాల అసెంబ్లీ మున్సిఫల్ వైస్ ఛైర్మెన్ గా ఉన్నారు. 

1985లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుండీ టీడీపీ టికెట్టును ఎన్టీఆర్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి గోపవరం పార్ధసారథిరెడ్డిపై  9 వేల మెజార్టీతో ఫరూక్ విజయం సాధించారు. తొలిసారిగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు.ఎన్టీఆర్ కేబినెట్ లో చక్కెర శాఖ, వక్ఫ్‌బోర్డు మంత్రిగా పనిచేశారు.

1989లో కాంగ్రెస్ అభ్యర్థి వి. రామనాథ రెడ్డి చేతిలో ఫరూక్ ఓటమి పాలయ్యారు.1994లో కాంగ్రెస్‌ అభ్యర్థి మక్బూల్‌ హుస్సేన్‌పై 40 వేల భారీ మెజార్టీతో గెలిచారు. 1994 నుంచి 1999 వరకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 1999 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎస్పీవై రెడ్డిపై 4 వేల మెజార్టీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు.

 చంద్రబాబు ప్రభుత్వంలో 1999 నుంచి 2004 వరకు రాష్ట్ర పురపాలక శాఖమంత్రిగా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రిగా, ఉర్దూ అకాడమీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలు అందించారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి చేతిలో 50 వేల తేడాతో ఓడిపోయారు.

2009, 2014 ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004 నుంచి 2017 వరకు ఏలాంటి పదవులు లేకున్నా, పార్టీకి విధేయుడిగా కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా సీఎం చంద్రబాబు ఫరూక్‌కు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి, మండలి చైర్మన్‌ పదవులు ఇచ్చారు. తాజాగా మంత్రి పదవి ఖరారు చేశారు. 

 

సంబంధిత వార్తలు

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

అరకు నుంచి అమాత్యుడిగా కిడారి శ్రవణ్

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్య సీక్రెట్ భేటీ

చంద్రబాబుతో దోస్తీపై గుర్రు: కాంగ్రెసుకు చిరంజీవి రాంరాం

నాకు మంత్రి పదవి కావాలి.. ఎమ్మెల్యే చాంద్ బాషా

చంద్రబాబు కొలువులో అఖిలప్రియ కన్నా చిన్న మంత్రి

చిన్నోడివైనా అవకాశం ఇచ్చా, మంచి పేరు తీసుకురా:శ్రవణ్ తో చంద్రబాబు

గవర్నర్ ఒప్పుకోరనుకున్నారేమో,అందుకే విప్:చాంద్ భాషా

మంత్రి పదవి ఆశించా, కౌన్సిల్ చైర్మన్ అయినా ఒకే:షరీఫ్

మంత్రివర్గంలో మైనార్టీలకు చోటుపై చంద్రబాబు వివరణ