అమరావతి: ఈ నెల 11వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ఈ నెల 11వ తేదీన  మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న  రెండు స్థానాలను భర్తీ చేయనున్నారు. ఎన్డీఏ నుండి  టీడీపీ వైదొలిగింది.  ఏపీ రాష్ట్రంలో  కూడ బీజేపీ టీడీపీ మంత్రివర్గం నుండి వైదొలిగింది.

దీంతో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఉన్న బీజేపీ మంత్రులు  మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈ ఖాళీలను భర్తీ చేయాలని బాబు భావిస్తున్నారు. మైనార్టీ, ఎస్టీ సామాజిక వర్గాలతో  భర్తీ చేయాలని టీడీపీ భావిస్తోంది.

మైనార్టీ వర్గానికి  చెందిన పార్టీ సీనియర్ నేత షరీఫ్‌కు  మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.  షరీఫ్‌ కు లేకపోతే శాసనమండలి ఛైర్మెన్  ఫరూక్ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం.

ఇక ఎస్టీ సామాజిక వర్గం నుండి కిడారి సర్వేశ్వరరావు తనయుడిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారంలో  ఉంది.