Asianet News TeluguAsianet News Telugu

చిన్నోడివైనా అవకాశం ఇచ్చా, మంచి పేరు తీసుకురా:శ్రవణ్ తో చంద్రబాబు

దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు కిడారి శ్రవణ్ కు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం లభించింది. తండ్రి మరణానంతరం కిడారి కుటుంబాన్ని ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగా పెద్ద కుమారుడికి గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చిన ఆయన చిన్న కుమారుడు శ్రవణ్ కు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పించారు. 

chandrababu naidu wishes to kidari sravan
Author
Amaravathi, First Published Nov 10, 2018, 6:34 PM IST

అమరావతి: దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు కిడారి శ్రవణ్ కు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం లభించింది. తండ్రి మరణానంతరం కిడారి కుటుంబాన్ని ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగా పెద్ద కుమారుడికి గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చిన ఆయన చిన్న కుమారుడు శ్రవణ్ కు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పించారు. 

మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పించడంతో కిడారి శ్రవణ్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. వయస్సులో చిన్నోడివి అయినా అవకాశం ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కేబినేట్  సహచరులతో పాటు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పనిచెయ్యాలని సూచించారు. 

మంత్రి పదవిని సద్వినియోగం చేసుకుని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు కిడారి శ్రవణ్ కు పలు సూచనలు చేశారు. ప్రజలకు చిత్తశుద్ధితో పని చెయ్యాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలన్నారు. 

ఆదివారం ఉదయం మంత్రిగా కిడారి శ్రవణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కిడారి శ్రవణ్ కు గిరిజన సంక్షేమ శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గిరిజన సామాజిక వర్గం చెందిన నేత కావడం, ఆ శాఖ ఖాళీగా ఉన్న నేపథ్యంలో శ్రవణ్ కు కేటాయించి గిరిజనులకు మరింత దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

ఈ వార్తలు కూడా చదవండి

గవర్నర్ ఒప్పుకోరనుకున్నారేమో,అందుకే విప్:చాంద్ భాషా

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

మంత్రి పదవి ఆశించా, కౌన్సిల్ చైర్మన్ అయినా ఒకే:షరీఫ్

మంత్రివర్గంలో మైనార్టీలకు చోటుపై చంద్రబాబు వివరణ

 

 

Follow Us:
Download App:
  • android
  • ios