అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి ముగ్గురు మైనారిటీ నేతలకు పదవులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అత్తర్ చాంద్ బాషా అన్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై పరోక్షంగా అసహనం ప్రదర్శించారు. 

వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించని చంద్రబాబు భావించినట్లున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే విప్ పదవి ఇస్తున్నట్లు చెప్పారన్నారు. పదవి ఏదైనా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తానని రాబోయే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. 

పార్టీకి మైనారిటీల్లో అనుకూలత తీసుకువస్తానన్నారు. 2014 ఎన్నికల్లో కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్తర్ చాంద్ బాషా వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో పార్టీ మారి సైకిలెక్కేశారు. ప్రస్తుతం అసెంబ్లీ విప్ గా ఎన్నికయ్యారు. త్వరలోనే చాంద్ బాషా అసెంబ్లీలో విప్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

మంత్రి పదవి ఆశించా, కౌన్సిల్ చైర్మన్ అయినా ఒకే:షరీఫ్

మంత్రివర్గంలో మైనార్టీలకు చోటుపై చంద్రబాబు వివరణ