అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి అంతా ఒక డ్రామా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర కొట్టిపారేశారు. వైసీపీ కార్యకర్త జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి చేస్తే దాన్ని రాజకీయంగా స్వప్రయోజనాల కోసం వాడుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 

తనపై దాడి కేసులో హైకోర్టును ఆశ్రయించిన జగన్ చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అరసెంటీమీటర్ గాయాన్ని బూతద్దంలో చూపించి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగితే ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారని అక్కడ బీజేపీ డైరెక్షన్ లో డ్రామా మెుదలుపెట్టారని విమర్శించారు. అరసెంటీమీటర్ గాయమైతే తొమ్మిది కుట్లు పడ్డాయంటూ ప్రజలకు చెప్పి ఆందోళనలు సృష్టించాలని ప్రయత్నించారని దుయ్యబుట్టటారు.   

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం చంద్రబాబును ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటీషన్ వేయడంపై మండిపడ్డారు. కేంద్రఆధీనంలో ఉండే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడిజరిగితే తమకు ఏంటి సంబంధం అని నిలదీశారు.  

మరోవైపు విచారణకు వైఎస్ జగన్ సహకరించడం లేదని కొల్లు మండిపడ్డారు. ఏపీ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వరని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదంటారని చెప్పారు. ఏపీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదు, ప్రభుత్వాస్పత్రులను నమ్మరు మరి కేంద్రప్రభుత్వాన్నే నమ్ముతారా అంటూ నిలదీశారు. 

జగన్ పై దాడి జరిగిన వెంటనే గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి నేరుగా ఫోన్ చేసి నివేదిక కోరతారని అలాగే తెలంగాణకు చెందిన సీఎం కేసీఆర్, కేటీఆర్ లు ఫోన్ చేసి పరామర్శిస్తారని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇస్తారంటూ మండిపడ్డారు. 

ఇకపోతే ఢిల్లీ వేదికగా వైసీపీ నేతలు చేస్తున్న కుట్ర రాజకీయ స్వప్రయోజనాల కోసం కాదా అని నిలదీశారు. దాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శరద్ యాదవ్ లను కలవడం వెనుక రాజకీయ ఎత్తుగడకోసమేనని విమర్శించారు.   
 

ఈ వార్తలు కూడా చదవండి

మిస్డ్ కాల్ వస్తే ఫోన్ చేశా: జగన్‌‌పై దాడి కేసులో గుంటూరు మహిళ

దాడి జరిగిన తర్వాత జగన్ విశాఖలో ఎందుకు ఆగలేదంటే......

శ్రీనివాస్ కి భద్రత కల్పిస్తాంః:హోం మంత్రి చినరాజప్ప భరోసా

జగన్ స్టేట్‌మెంట్‌కోసం మరోసారి ఏపీ పోలీసుల యత్నం

చంద్రబాబు ప్రతివాదిగా కోర్టులో పిటిషన్: జగన్ వాదన ఇదీ

మల్లెల బాబ్జీకి పట్టిన గతే శ్రీనివాస్ కు,శివాజీ కూడా కుట్రదారుడే :తమ్మినేని

దాడి కేసు విచారణపై హైకోర్టులో జగన్ పిటిషన్....ప్రతివాదిగా చంద్రబాబు
జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ