విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రాజీనామాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించే పనిలో పడింది. రాధా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, వైసీపీలోనే ఉండేలా ఒప్పించేందుకు రాయబారాన్ని నడిపించేందుకు రెడీ అయ్యింది. 

రాధా ఆప్తమిత్రుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని రంగంలోకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాధా తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపడంతో పాటు త్వరగా ఆమోదించాలని కోరారు. దీంతో ఆఖరి ప్రయత్నంగా కొడాలి నానిని రంగంలోకి దింపాలని సూచిస్తోంది. 

ఈ నేపథ్యంలో కొడాలి నాని సోమవారం తన మిత్రుడు రాధాకృష్ణతో భేటీ అయ్యే అవకాశం ఉంది. వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోకి వెళ్తారని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీలో చేరకుండా ఉండటంతోపాటు వైసీపీలో ఉండేలా చూడాలంటూ గుడివాడ నానికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. 

గతంలో కూడా రాధాకృష్ణ జనసేన పార్టీలోకి చేరబోతున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో గుడివాడ నాని రంగప్రవేశం చేశారు. రాధాకృష్ణతో చర్చించారు. దీంతో రాధా వైసీపీని వీడకుండా మౌనంగా ఉండిపోయారు. అయితే గుడివాడ నాని రాయబారంతో రాధాకృష్ణ మెత్తబడతారా అన్న సందేహం నెలకొంది. 

ఇప్పటికే రాధా వైసీపీకి రాజీనామా చెయ్యడంతోపాటు పార్టీ అధినేత వైఎస్  జగన్ పై ఘాటుగా లేఖ రాయడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి తరుణంలో రాధా తన మనసు మార్చుకుంటారా అని అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

రాధాను పార్టీలో ఉండేలా నాని ఎలా కన్విన్స్ చేస్తారో అన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీలో ఉండేందుకు ఏ హామీ ఇచ్చి రాయబారానికి పంపిస్తోంది అన్న అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో దానికి మించి ఆఫర్ ఏదైనా వైసీపీ ఇచ్చే అవకాశం ఉందా అనేది తెలియాలంటే మరికాసేపు వేచి చూడాల్సిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా