విజయవాడ: వైసీపీ నేత వంగవీటి రాధాతో రంగా, రాధా మిత్రమండలి మంగళవారం నాడు సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్టీ అన్యాయం చేసిందని రంగా, రాధా మిత్రమండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ నాయకత్వంతో చర్చిస్తున్నామని  రాధా వారికి నచ్చజెప్పారు.

విజయవాడ సెంట్రల్ సీటును  మల్లాది విష్ణుకు కేటాయించే దిశగా  వైసీపీ సంకేతాలను ఇస్తోంది. తాజాగా  మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్  సమన్వయకర్తగా బాధ్యతలను  అప్పగించింది.ఈ పరిణామంతో వంగవీటి రాధా అనుచరులు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు.

నిన్నటి నుండి పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో  వంగవీటి రాధా, రంగా మిత్రమండలి కార్యకర్తలు, రంగా, రాధా అభిమానులు  వంగవీటి రాధాతో సమావేశమయ్యారు.

విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించే దిశగా  పార్టీ సంకేతాలు ఇవ్వడంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. పార్టీ అన్యాయం చేసిందని  పలువురు రాధా అభిమానులు , అనుచరులు నినాదాలు చేశారు.

ఈ సమావేశానికి ముందుగానే వైసీపీ సభ్యత్వ నమోదు పుస్తకాలను  ఓ కార్యకర్త తగులబెట్టాడు.  వంగవీటి రాధాకే విజయవాడ సెంట్రల్ సీటును కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ నాయకత్వం  రాధాకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ పార్టీ సభ్యత్వపుస్తకాలను దగ్థం చేశారు.రాధా వెంటే ఉంటామని రంగా, రాధా మిత్రమండలి నిర్ణయం తీసుకొంది.రాధా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.

ఈ వార్తలు చదవండి

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..?

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత