విజయవాడ:విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీ  అధిష్టానం కూడ వెనక్కు తగ్గలేదు.  వైసీపీ  విజయవాడ సెంట్రల్  సమన్వయకర్తగా బాధ్యతలను అప్పగించారు. దీంతో వంగావీటి రాధా, రంగా మిత్రమిండలి కార్యకర్తలతో వంగవీటి రాధా సమావేశమయ్యారు.  భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించేందుకు  వైసీపీ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇదే స్థానం నుండి పోటీ చేసేందుకు వంగవీటి రాధా మూడున్నరేళ్లుగా ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరారు.

మల్లాది విష్ణుకు  వైసీపీ సెంట్రల్ సెగ్మెంట్ సమన్వయకర్తగా నియమించారు. దీంతో వంగవీటి రాధా, వంగవీటి రంగా అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ సెంట్రల్ సీటు నుండి పోటీ చేసేందుకు వంగవీటి రాధా ఆసక్తిని చూపుతున్నారు. ఇదే సీటు నుండి  పోటీ చేసేందుకు మల్లాది విష్ణు కూడ ఆసక్తితో ఉన్నాడు.  మల్లాది విష్ణుకు ఈ సీటును కేటాయించడం వల్లే  పార్టీకి ప్రయోజనం ఉంటుందని   వైసీపీ భావిస్తోంది. వంగవీటి రాధాకు మచిలీపట్నం ఎంపీ సీటు లేదా  ఆవనిగడ్డ లేదా విజయవాడ తూర్పు సీటును కేటాయించాలని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం.

అయితే విజయవాడ సెంట్రల్ సీటును కాదని  తాను వేరే స్థానం నుండి పోటీ చేయబోనని వంగవీటి రాధా పార్టీ నాయకత్వాన్ని తెగేసి చెప్పాడు. దీంతో  రంగా , రాధా మిత్రమండలితో వంగవీటి రాధా మంగళవారం నాడు సమావేశమయ్యారు.

విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వంగవీటి రాధా నుండి ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే మల్లాది విష్ణు వైపుకే  జగన్ మొగ్గు చూపారు. ఈ మేరకు వైసీపీ సెంట్రల్ పార్టీ సమన్వయకర్త బాధ్యతలను మల్లాది విష్ణుకు అప్పగించారు.

ఈ వార్తలు చదవండి

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..?

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత