విజయవాడ: విజయవాడ సెంట్రల్  వైసీపీ టిక్కెట్టును వంగవీటి రాధాకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ వంగవీటి రంగా, రాధా అభిమానులు సోమవారం నాడు  రంగా విగ్రహం వద్ద నిరసనకు దిగారు.

మూడున్నర ఏళ్లుగా  విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ కేంద్రంగా  వంగవీటి రాధా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుండి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే  గత ఏడాది  పార్టీలో చేరిన మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటును కేటాయిస్తామని హామీ ఇచ్చిందని విష్ణు వర్గీయులు చెబుతున్నారు.

దీంతో మల్లాది విష్ణుకే  టిక్కెట్టు కేటాయించేందుకు  వైసీపీ నాయకత్వం సానుకూలంగా స్పందించింది.  ఈ పరిణామాల నేపథ్యంలో వంగవీటి రాధా పార్టీ నాయకత్వంపై  ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

సోమవారం నాడు తన ఇంటి వద్ద ఉన్న వంగవీటి రాధాతో యలమంచిలి రవి సమావేశమయ్యారు.  పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై రాధాతో చర్చించారు.

ఇదిలా ఉంటే  విజయవాడ సెంట్రల్ సీటును వంగవీటి రాధాకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ వంగవీటి రంగా , వంగవీటి రాధా అభిమానులు  రంగా  విగ్రహం ముందు ఆందోళనకు దిగారు.

ఈ వార్తలు చదవండి

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు