విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు టీడీపీ గాలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఉన్న రాధాను టీడీపీలోకి తెచ్చేందుకు  ప్రయత్నాలు సాగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

విజయవాడ సెంట్రల్ సీటు విషయమై వైసీపీలో చిచ్చు రేగింది. విజయవాడ  సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించాలని ఆ పార్టీ నాయకత్వం దాదాపుగా నిర్ణయం తీసుకొంది. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకర్గం నుండి పోటీచేయాలని  వంగవీటి రాధాను పార్టీ నాయకత్వం  సూచించినట్టు సమాచారం.

దీంతో సెంట్రల్ సీటు నుండే పోటీ చేస్తానని వంగవీటి రాధా పార్టీ నాయకత్వానికి చెప్పేసి ఆదివారం నాడు పార్టీ నిర్వహించిన సమావేశం నుండి ఆయన బయటకు వెళ్లిపోయాడు. అయితే  వైసీపీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  టీడీపీ కూడ ఆచితూచిగా అడుగులు వేస్తోంది.

వైసీపీలో చోటు చేసుకొన్న పరిణామాలను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం సాగుతోంది. వంగవీటి రాధాను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు  ప్రయత్నాలు సాగుతున్నట్టు ప్రచారం జరగడం కూడ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ సీటును ఆశిస్తున్నాడు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ సీటులో టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఒకవేళ వంగవీటి రాధా టీడీపీలోకి వస్తే  విజయవాడ సెంట్రల్ సీటు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

అయితే ఇదిలా ఉంటే తనతో టీడీపీ నేతలు ఎవరూ కూడ టచ్‌లోకి రాలేదని వంగవీటి రాధా ప్రకటించారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న రాధాతో పార్టీ ముఖ్య నేతలు ఫోన్ బుజ్జగింపులు జరిపినట్టు సమాచారం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని సూచించినట్టు తెలుస్తోంది.

ఈ వార్త చదవండి

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు