Asianet News TeluguAsianet News Telugu

కన్నబాబు: జర్నలిస్టు నుంచి మంత్రి దాకా

జర్నలిస్టుగా పనిచేసి ఆ తర్వాత  రాజకీయాల్లో చేరిన కురసాల కన్నబాబు  మంత్రి పదవి దక్కింది. వైఎస్ జగన్ మంత్రివర్గంలో కన్నబాబుకు చోటు దక్కింది.
 

kannababu gets cabinet berth
Author
Amaravathi, First Published Jun 7, 2019, 8:27 PM IST

అమరావతి: జర్నలిస్టుగా పనిచేసి ఆ తర్వాత  రాజకీయాల్లో చేరిన కురసాల కన్నబాబు  మంత్రి పదవి దక్కింది. వైఎస్ జగన్ మంత్రివర్గంలో కన్నబాబుకు చోటు దక్కింది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఈనాడు దినపత్రికలో జర్నలిస్టుగా కన్నబాబు గతంలో పనిచేశాడు.2009 ఎన్నికలకు ముందు కన్నబాబు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

ఆ ఎన్నికల్లో కన్నబాబు కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం నుండి పీఆర్పీ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నేలకుర్తి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు.పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో కన్నబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో  కన్నబాబు ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 

2014 ఎన్నికల తర్వాత కన్నబాబు వైసీపీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా కూడ కొంతకాలం పాటు పనిచేశారు. 2019 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుండి కన్నబాబు వైసీసీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. జగన్ తన మంత్రివర్గంలో కన్నబాబుకు చోటు కల్పించారు.

కాపు సామాజికవర్గం కోటాలో కన్నబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కంది. జర్నలిస్టుగా పనిచేసిన కన్నబాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎన్నికల్లో ఆంధోల్ నుండి పోటీ చేసిన జర్నలిస్టు క్రాంతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదే రాష్ట్రంలో మాజీ జర్నలిస్టు రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నారు. గత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓదేలు ఈ దఫా పోటీ చేయలేదు. ఈయన కూడ గతంలో జరల్నిస్టుగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

పార్టీ మారి బూరెల బుట్టలో పడ్డ అవంతి శ్రీనివాస్

రెండు సార్లు రోజాతో భేటీ: బుజ్జగించిన వైఎస్ జగన్

రోజాకు జబర్ధస్త్ షాక్: జగన్ కొలువులో 25 మంది వీరే
సీనియర్లకు షాక్: విధేయులకే జగన్ పట్టం

వైఎస్ జగన్ మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఇదే

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి

రోజాకు జబర్ధస్త్ షాక్: జగన్ కొలువులో 25 మంది వీరే

చంద్రబాబుకు కౌంటర్: నామినేటేడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట

జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్

ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం

విజయసాయి ఫోన్లు: జగన్ కొలువులో మంత్రులు వీరే (లైవ్ అప్‌డేట్స్)

 

Follow Us:
Download App:
  • android
  • ios