Asianet News TeluguAsianet News Telugu

జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్

తాను ఏ నిర్ణయం తీసుకొన్నా కూడ అందరితో చర్చించి నిర్ణయం తీసుకొంటానని ఏపీ సీఎం వైఎస్ జగన్  నిరూపించారు. 25 మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని జగన్ తేల్చి చెప్పారు.గతానికి భిన్నంగా  జగన్ వ్యవహరశైలిలో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

ys jagan changes his atitude
Author
Amaravathi, First Published Jun 7, 2019, 12:58 PM IST

అమరావతి:  తాను ఏ నిర్ణయం తీసుకొన్నా కూడ అందరితో చర్చించి నిర్ణయం తీసుకొంటానని ఏపీ సీఎం వైఎస్ జగన్  నిరూపించారు. 25 మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని జగన్ తేల్చి చెప్పారు.గతానికి భిన్నంగా  జగన్ వ్యవహరశైలిలో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైఎస్ఆర్‌సీఎల్పీ ఏర్పాటు తర్వాత జగన్ తీసుకొన్న నిర్ణయాలను కొందరు ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు. వైసీపీ నుండి బయటకు వచ్చిన నేతలు జగన్ వ్యవహరశైలిపై తీవ్ర విమర్శలు చేశారు. 

2014 ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడానికి జగన్  నిర్ణయాలు కూడ కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఆ తర్వాత జగన్ తన వ్యవహరశైలిలో మార్పు చేసుకొన్నాడని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో  ఏపీలో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకొంది. 151 మంది ఎమ్మెల్యేలను వైసీపీ కైవసం చేసుకొంది. టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితమైంది.

25 మందికి మంత్రి పదవులను కట్టబెట్టనున్నట్టు జగన్ శుక్రవారం నాడు నిర్వహించిన వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్  ప్రకటించారు.కష్టనష్టాలను ఎన్ని వచ్చినా కూడ తనతో నడిచారని ఈ సమావేశంలో జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ఎవరినీ కూడ విస్మరించను.. అందరికీ న్యాయం చేస్తానని కూడ జగన్ హామీ ఇచ్చారు. రేపు మంత్రి పదవి దక్కేవారికి రెండున్నర ఏళ్ల తర్వాత 90 శాతం మందిని మార్చుతానని ఆయన స్పష్టం చేశారు.

మిగిలిన రెండున్నర ఏళ్లు మరో 25 మందికి చోటు కల్పిస్తామని ఆయన ప్రకటించారు. మంత్రి పదవులను తప్పించిన వారికి పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా పార్టీ సేవలకు వినియోగించుకొంటామని జగన్ ప్రకటించారు. పార్టీ, ప్రభుత్వం రెండు కళ్లలాంటివని జగన్ తేల్చి చెప్పారు.

రెండు కళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని జగన్ తేల్చి చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలని జగన్ చెప్పారు.151 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేమని జగన్ చెప్పారు. అయితే తాను పదవులు ఇవ్వలేకపోయినవారు బాధ పడకూడదని కూడ జగన్ వైఎస్ఆర్‌ఎల్పీ సమావేశంలో చెప్పారు.

పదవులు దక్కలేదనే  ఎవరూ కూడ ఇబ్బందులు పడకూడదనే విషయాన్ని ముందుగానే జగన్ పార్టీ నేతలకు ఒప్పించే ప్రయత్నం చేశారు సీనియర్లు, పార్టీ నేతల మాటలను జగన్ పట్టించుకోకపోయేవాడనే ప్రచారం ఉండేది. కానీ, ఆ ప్రచారానికి భిన్నంగా జగన్ వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

సంబంధిత వార్తలు

ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం

Follow Us:
Download App:
  • android
  • ios