అమరావతి: వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజాకు  జగన్  కేబినెట్‌లో చోటు దక్కలేదు.  చివరి నిమిషంలో రోజా పేరును మంత్రివర్గం నుండి తప్పించారని  సమాచారం. విజయవాడలోనే అందుబాటులోనే  ఉండాలని  జగన్  ఆమెకు సూచించారు.

వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశం  ముగిసిన తర్వాత  వైఎస్ జగన్ రోజాతో  ఫోన్‌లో మాట్లాడారు. మంత్రివర్గంలోకి రోజాను తీసుకోవాలని జగన్ భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో  రోజాకు మంత్రివర్గంలో చోటు కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఇదే విషయమై జగన్ రోజాతో చర్చించారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడ రోజాతో రెండు దఫాలు మాట్లాడి ఆమెకు ఏ కారణాల చేత మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయారో వివరించారు. అయితే  ఈ సమయంలో రోజాను బుజ్జగించే ప్రయత్నం జగన్ కూడ చేశారు.

రెండో దఫాలు జగన్‌ రోజాతో భేటీ అయ్యారు. ఆమెకు నచ్చజెప్పారు. మంత్రివర్గంలో చోటు కల్పించకపోయినా కూడ ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని  జగన్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం రోజా చేసిన సేవలను జగన్ గుర్తు చేశారు.విజయవాడలోనే అందుబాటులోనే ఉండాలని జగన్ రోజాకు సూచించారు. 

జగన్ మంత్రివర్గంలో రోజాకు మంత్రిపదవి దక్కుతోందని మొదటి నుండి ప్రచారంలో ఉంది. కానీ, చిత్తూరు జిల్లా నుండి  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కింది. మహిళల కోటాలో  కూడ ఆయా సామాజిక వర్గాల నుండి  చోటు కల్పించారు. మహిళల కోటాలో కూడ రోజాకు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోలేని పరిస్థితి నెలకొందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

చివరి నిమిషంలోనే మంత్రివర్గం నుండి  రోజా పేరును తప్పించాల్సిన పరిస్థితులను జగన్ ఆమెకు  వివరించారని  సమాచారం. అయితే పార్టీ కోసం ఆమె చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని విజయవాడలోనే అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు. 

రోజాను విజయవాడలోనే అందుబాటులోనే ఉండాలని జగన్ సూచించడంతో  ఆమెకు మరేదైనా పదవిని ఇస్తారా అనే చర్చ కూడ సాగుతోంది. వైసీపీలో జగన్ ‌ వెంట మొదటి నుండి నడిచినప్పటికీ ఫైర్ బ్రాండ్లుగా ముద్రపడిన రోజా, అంబటి రాంబాబులకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. 

సంబంధిత వార్తలు

రోజాకు జబర్ధస్త్ షాక్: జగన్ కొలువులో 25 మంది వీరే
సీనియర్లకు షాక్: విధేయులకే జగన్ పట్టం

వైఎస్ జగన్ మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఇదే

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి

రోజాకు జబర్ధస్త్ షాక్: జగన్ కొలువులో 25 మంది వీరే

చంద్రబాబుకు కౌంటర్: నామినేటేడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట

జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్

ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం

విజయసాయి ఫోన్లు: జగన్ కొలువులో మంత్రులు వీరే (లైవ్ అప్‌డేట్స్)