అమరావతి: తన కేబినెట్‌లో చోటు దక్కేవారికి  శుక్రవారం సాయంత్రం  ఫోన్లు వస్తాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

శుక్రవారం నాడు అమరావతిలోని తన నివాసంలో  వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో కేబినెట్‌ కూర్పు గురించి జగన్ కీలక విషయాలను ప్రకటించారు.

కేబినెట్‌లో చోటు దక్కేవారికి ఇవాళ సాయంత్రం ఫోన్ వస్తోందని ఆయన తేల్చి చెప్పారు.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్  చేస్తారని జగన్ ప్రకటించారు. విజయసాయి రెడ్డి ఫోన్ కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.

జగన్ కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కనుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేబినెట్‌లోని చోటు దక్కే 25 మందిలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులను కట్టబెట్టనున్నారు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి.
 

కేబినెట్‌లో చోటు దక్కే వారికి విజయ సాయి రెడ్డి ఫోన్ చేసి కేబినెట్ లో బెర్త్ దక్కనుందని చెప్పారు. ప్రమాణస్వీకారానికి రెడీగా ఉండాలని విజయసాయి రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించనున్నారు.

సంబంధిత వార్తలు

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం