అమరావతి:   నామినేటేడ్ పదవుల్లో  50 శాతం బీసీలకే కట్టబెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఇదే విషయాన్ని వైసీఎల్పీ సమావేశంలో జగన్ స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని జగన్ ప్రజలకు సంకేతాలు ఇచ్చారు.

శుక్రవారం నాడు వైఎస్‌ఆర్‌సీఎల్పీ  సమావేశం అమరావతిలో జగన్ నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో రానున్న రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాల గురించి జగన్ వివరించారు.

కేబినెట్‌లో 25 మందికి చోటు కల్పించనున్నట్టు ప్రకటించారు. కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు కల్పించనున్నట్టు జగన్ తేల్చి చెప్పారు. రెండున్నర ఏళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మార్చనున్నట్టు జగన్ తేల్చి చెప్పారు.

నామినేటేడ్ పదవుల్లో బీసీలకు పెద్ద ఎత్తున చోటు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. రానున్న రోజుల్లో నామినేటేడ్ పదవుల్లో  బీసీలకు కనీసంగా 50 శాతం పదవులను కట్టబెట్టనున్నారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో ప్రకటించారు.

టీడీపీ ఆవిర్భావం నుండి బీసీలు ఆ పార్టీకి వెన్నంటి ఉన్నారు. బీసీలను తమ వైపుకు తిప్పుకొనేందుకు వీలుగా జగన్ బీసీలకు పదవుల పంపకంలో  ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకొన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. 

బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.కాపులకు రిజర్వేషన్లు కూడ బీసీలను టీడీపీకి దూరమయ్యారనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. 

సంబంధిత వార్తలు

జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్

ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం