అమరావతి: జగన్ కేబినెట్‌లో మొదటి నుండి పార్టీకి విధేయులుగా ఉన్నవారికి కేబినెట్ లో చోటు కల్పించారు. రోజా, అంబలి రాంబాబు లాంటి వాళ్లకు తొలి కేబినటె్ లో బెర్త్ దక్కలేదు. ఈ దఫా మంత్రులుగా ఉన్నవారు రెండున్నర ఏళ్ల తర్వాత పార్టీ బాద్యతలు నిర్వహించనున్నారు. 

వైఎస్ జగన్  మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణం చేసేందుకు రెడీగా ఉండాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం నాడు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేశారు.

బొత్స సత్యనారాయణ,  పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, సుచరితలకు విజయసాయిరెడ్డి ఫోన్లు చేశారు.రేపు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్దంగా ఉండాలని విజయసాయిరెడ్డి సూచించారు.

మంత్రి పదవులు దక్కేవారికి శుక్రవారం సాయంత్రం విజయసాయిరెడ్డి ఫోన్లు చేస్తారని వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ ప్రకటించారు. అయితే మంత్రులుగా ప్రమాణం  చేసే వారు తమ కార్యకర్తలకు సమాచారం ఇచ్చేందుకు వీలుగా శుక్రవారం నాడు మధ్యాహ్నమే విజయసాయిరెడ్డి ఫోన్లు చేశారు. మిగిలినవారికి కూడ విజయసాయి రెడ్డి ఫోన్లు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇకపోతే జగన్ కేబినెట్ లో బెర్త్ కన్ఫమ్ చేసుకున్న వారికి విడతల వారీగా ఫోన్లు చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఫోన్ చేసిన విజయసాయిరెడ్డి తాజాగా మరో నలుగురికి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవాలంటూ స్పష్టం చేస్తున్నారు. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు ఎమ్మెల్యే,మాజీమంత్రి కొలుసు పార్థసారధిలకు ఫోన్ చేశారు. 

ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి నుంచి ఫోన్లు అందుకున్న ఎమ్మెల్యేల జాబితా ఇదే..

ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం)
బొత్స సత్యనారాయణ (విజయనగరం)
పాముల పుష్ప శ్రీవాణి (విజయనగరం)
అవంతి శ్రీనివాస్‌ (విశాఖ)
కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి)
పినిపె విశ్వరూప్‌ (తూర్పుగోదావరి)
పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (తూర్పుగోదావరి)
కొడాలి నాని (కృష్ణా)
వెల్లంపల్లి శ్రీనివాస్‌ (కృష్ణా)
పేర్ని నాని (కృష్ణా జిల్లా)
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ప్రకాశం)
మేకపాటి గౌతమ్‌ రెడ్డి (నెల్లూరు)
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు)
ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి)
చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (పశ్చిమ గోదావరి)
తానేటి వనిత (పశ్చిమ గోదావరి)
మేకతోటి సుచరిత (గుంటూరు)
మోపిదేవి వెంకటరమణ (గుంటూరు)
బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (కర్నూలు)

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)
గుమ్మనూరు జయరాములు (కర్నూలు)
నారాయణస్వామి (చిత్తూరు)
అంజాద్‌ బాషా (కడప)
శంకర్‌నారాయణ (అనంతపురం)

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు కౌంటర్: నామినేటేడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట

జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్

ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం