అమరావతి: ఈ నెల 8వ తేదీ ఉదయం 9:15 గంటలకు వైఎస్ జగన్ మంత్రివర్గంలోని సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.  మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తన మంత్రివర్గంలో 25మందికి చోటు కల్పించనున్నట్టు జగన్ ప్రకటించారు. గురువారం నాడు అమరావతిలో నిర్వహించిన వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో కేబినెట్ కూర్పు గురించి జగన్ ప్రకటించారు.

మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సుమారు 5వేల మందికి ఆహ్వానాలను పంపారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం రెండు మార్గాలను ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నవారికే గ్యాలరీలోకి ఎంట్రీ అవకాశం కల్పిస్తారు. మంత్రివర్గసభ్యుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి  1500 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు.

సచివాలయంలోనే మంత్రివర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం వైఎస్ జగన్ తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం 8:39 గంటలకు జగన్ సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం  8:42 గంటలకు జగన్ తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 8:50 గంటలకు ముఖ్యమైన ఫైళ్లపై జగన్ సంతకాలు పెడతారు.ఉదయం 9:15 గంటల నుండి 11:30గంటల వరకు మంత్రివర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం ఉంటుంది. 

ఉదయం 11:49 గంటలకు జగన్ తొలి మంత్రివర్గం భేటీ కానుంది జగన్‌ మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేయించేందుకు గాను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ గురువారం మధ్యాహ్నం విజయవాడకు చేరుకొన్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో గవర్నర్ దంపతులకు బస ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

విజయసాయి ఫోన్లు: జగన్ కొలువులో మంత్రులు వీరే (లైవ్ అప్‌డేట్స్)

చంద్రబాబుకు కౌంటర్: నామినేటేడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట

జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్

ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం