అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్  భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో  ప్రసంగిస్తున్న సమావేశంలో భావోద్వేగంతో ప్రసంగించారు.

శుక్రవారం నాడు అమరావతిలోని తన నివాసంలో  వైఎస్ జగన్  అధ్యక్షతన వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జగన్ భావోద్వేగానికి గురయ్యారు. నాతో పాటు మీరంతా అష్టకష్టాలు పడ్డారని ఆయన గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడ తనతో పాటే ప్రయాణించారని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

తనతో పాటు మీరంతా ఇబ్బందులు పడ్డారని జగన్ గుర్తు చేశారు. ఎవరికీ కూడ అన్యాయం చేయనని జగన్ స్పష్టం చేశారు.ఎవరినీ విస్మరించను, ఎవరినీ కూడ వదులుకోనని జగన్ తేల్చి చెప్పారు. ఈ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు కూడ కన్నీటి పర్యంతమయ్యారని సమాచారం.

రెండున్నర ఏళ్ల తర్వాత 90 శాతం ఎమ్మెల్యేలను మార్చనున్నట్టు జగన్ తేల్చిచెప్పారు.ప్రతి ఒక్కరికీ కూడ అవకాశాలను కల్పిస్తామని  ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం