అమరావతి:  మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గరగా ఉండాలని  వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఆ పార్టీ చీఫ్, ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. పేదల సంక్షేమం కోసం పాలనలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అమరావతిలోని తన నివాసంలో వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైఎస్ జగన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు దిశా నిర్ధేశం చేశారు. రాష్ట్రం మొత్తం మనవైపే చూస్తోందన్నారు.అవినీతికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదన్నారు. చంద్రబాబునాయుడు పాలనలో   దోచుకొన్నారని ఆయన ఆరోపించారు.

ఏ మాత్రం అవినీతికి అవకాశం ఉండకూడదని జగన్ సూచించారు.   ప్రమాణస్వీకారం నుండి పారదర్శకతకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఆయన చెప్పారు.