రాజకీయ ప్రత్యర్థులపై జీవీఎల్ బూతులు

First Published 3, Jul 2018, 3:33 PM IST
gvl narasimha contravercy comments on tdp leaders on live
Highlights

చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డ జీవీఎల్

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు.. లైవ్ లో బూతులు మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్న వారిని ఉద్దేశించి.. ఆయన అసభ్యకర పదజాలాన్ని వినియోగించారు..

పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం జీవీఎల్ మీడియా సమావేశంలో ప్రసంగించారు. టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి గ్రహణం పట్టిందని ఆరోపించారు. ప్రస్తుతం తమ పార్టీకి పట్టిన చంద్ర గ్రహణం వీడిందని ఎద్దేవా చేశారు. పచ్చ పార్టీ నాయకులు బీజేపీ నాయకుల అంతు చూస్తామని సోషల్‌ మీడియాలో భయపెడుతున్నారని పేర్కొన్నారు. అధికారం ఉందని భయపెడితే తాము భయపడబోమన్నారు. ప్రతి ***కు బీజేపీని భయపెట్టడం అలవాటుగా మారిందని పరుష పదజాలంతో దుయ్యబట్టారు.

అనంతరం చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని జీవీఎల్‌ వెల్లడించారు. స్పెషల్‌ ప్యాకేజీ కింద 5 ప్రాజెక్టులకు రూ.12,572 కోట్ల పనులు జరుగుతాయని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు. మరో 7 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వాటి విలువ రూ. 17,236 కోట్లు అని అందులో పేర్కొన్నట్లు జీవీఎల్‌ వెల్లడించారు. ఇలా చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు చేసి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

loader