ఒంగోలు: ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించి సుమలత కేసులో దిమ్మ తిరిగే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమలత మగ వేషం ధరించి బాలికలపై కృత్రిమ సాధనాలతో లైంగిక దాడులకు పాల్పడిందనేందుకు మరో బలమైన ఆధారం పోలీసులకు చిక్కింది. సుమలత విగ్ పెట్టుకుని సాయి అనే పేరుతో మగవాడిలా చెలామణి అయినట్లు సమాచారం. 

మగవాడిలా వేషం మార్చి గొంతు కూడా మార్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. నిందితురాలు సుమలత భరత్ ఏడుకొండలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సాక్ష్యాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read:ఆమెకు అమ్మాయిలపై మోజు... సెక్స్ టాయ్స్ తో శృంగారం

సింగరాయకొండ సీఐ టీఎస్క్ అజయ్ కుమార్ శుక్రవారం సుమలత నివాసం ఉన్న ఒంగోలులోని మారుతినగర్ లో గల పెంట్ హౌస్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏడు ప్రేమలేఖలు బయటపడ్డాయి. వాటిని సీజ్ చేశారు. నోటు పుస్తకాలు చించి వాటిని రాసినట్లు తెలుస్తోంది. వాటిలో మూడు లేఖలు హాయ్ పేరుతో ఉంటే మరో నాలుగు లేఖలు సాయిచరణ్ పేరుతో ఉన్నాయి. దాంతో సాయిచరణ్ అనే పేరు కల్పితమని అర్థమైంది. 

పొడవైన జుట్టును ఎలా కప్పి పెట్టి ఉంటుందనే సందేహానికి కూడా విగ్ బయటపడడంతో సమాధానం లభించింది. పొడవైన జట్టు ఇమిడిపోయే విధంగా మగవారు ధరించే విగ్ శుక్రవారంనాడు తనిఖీల్లో పోలీసులకు లభించింది. దీంతో బాలికలను ఆకర్షించేందుకు సుమలత సాయిచరణ్ గా వేషం ధరించిందనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. 

పోలీసులకు చిక్కిన ఏడు ప్రేమలేఖలు కూడా ఒకే రాతతో ఉన్నాయి. అయితే, చివర సంతకాలు మాత్రం లేవు. సుమలత జీవిత విశేషాలను తెలుసుకోవడం ద్వారా ఆమె షీ మ్యాన్ గా మారడానికి గల కారణాలను కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.