జయరామ్ హత్య కేసులో  తనకు ఎలాంటి సంబంధం లేదని  శిఖా చౌదరి చెబుతున్నారని  కబాలీ సినిమా తెలుగు ప్రొడ్యూసర్ కేపీ చౌదరి చెప్పారు. 

అమరావతి: జయరామ్ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని శిఖా చౌదరి చెబుతున్నారని కబాలీ సినిమా తెలుగు ప్రొడ్యూసర్ కేపీ చౌదరి చెప్పారు. విజయవాడ పోలీసుల అదుపులో ఉన్న శిఖా చౌదరిని కలిసిన తర్వాత కేపీ చౌదరి ఆదివారం నాడు కూడ కొన్ని తెలుగు న్యూస్ ఛానెల్స్‌తో మాట్లాడారు.

శిఖా చౌదరిని తన కారులోనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారని కేపీ చౌదరి చెప్పారు. తన కారును శనివారం సాయంత్రమే తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని శిఖా చెప్పారని ఆయన చెప్పారు. మరో వైపు శిఖా తల్లి కూడ ఇదే విషయాన్ని తనతో చెప్పారన్నారు. శిఖాతో, జయరాం చాలా ప్రేమగా ఉండేవారని ఆమె తల్లి తనకు చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

జయరామ్‌ను శిఖా చంపించే అవకాశం ఉండదని శిఖా తల్లి చెప్పారని ఆయన చెప్పారు. అయితే రాకేష్ రెడ్డి శిఖా చౌదరికి ఒకప్పటి ఫ్రెండ్‌గానే తనకు మీడియాలో వచ్చిన వార్తల ద్వారా తెలిసిందన్నారు. 

జయరామ్ హత్య గురించిన సమాచారాన్ని మీడియాలో చూసిన తాను శిఖాకు ఫోన్ చేస్తే ఈ విషయమై తనకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు ఇస్తానని శిఖా చౌదరి చెప్పారు. రాకేష్ రెడ్డి ఎవరో తనకు తెలియదని కేపీ చౌదరి చెప్పారు. శిఖా చౌదరి తనను అన్నయ్య అని పిలుస్తోందని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు