హైదరాబాద్: 2019 ఎన్నికల్లో  గెలిచే అభ్యర్థులకే టికెట్లను కేటాయించనున్నట్టు  టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నట్టు బాబు చెప్పారు.

మంగళవారం  నాడు  టీడీపీ వ్యూహ కమిటీ సభ్యులతో   చంద్రబాబునాయుడు అమరావతిలో సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు, 2019  ఎన్నికల గురించి చంద్రబాబునాయుడు చర్చించారు.

2019 ఎన్నికల్లో గెలిచే  అభ్యర్థులకు టికెట్లు కేటాయించనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.  ఎమ్మెల్యేల తీరు గురించి ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకొంటున్నట్టు  బాబు చెప్పారు.

ప్రజలతో నిరంతరం ఉండే ఎమ్మెల్యేలకే భవిష్యత్‌లో జరిగే  ఎన్నికల్లో టికెట్టు  దక్కుతోందన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ప్రజామోదం మేరకే నిర్ణయం తీసుకొంటానని బాబు తేల్చిచెప్పారు.

వచ్చే ఎన్నికల్లో  గెలుపు ప్రధానమనేది చంద్రబాబునాయుడు  తేల్చి చెప్పారు. అందుకే  గెలుపు గుర్రాలకే  టికెట్లు  కేటాయించనున్నట్టు  బాబు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 20న నెల్లూరులో, ఈ నెల 27న విజయనగరం జిల్లాలో ధర్మపోరాట సభలను  నిర్వహిస్తున్నట్టు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మరో వైపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  చివరి ధర్మపోరాట సభను నిర్వహించనున్నట్టు బాబు చెప్పారు.  ఈ సభకు పలు పార్టీల జాతీయ నాయకులు వస్తారని  బాబు చెప్పారు.

సంబంధిత వార్తలుః

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

ఫరూఖ్ చాలా ముదురు... కొత్త మంత్రులకు సహకరించండి: చంద్రబాబు

ఏపీ కేబినెట్ విస్తరణ: కొత్త మంత్రుల శాఖలు ఇవే

గవర్నర్‌తో బాబు భేటీ.. జగన్‌పై దాడి కేసు వివరాలు అడిగిన నరసింహాన్

జగన్‌పై దాడి ఎఫెక్ట్: గవర్నర్‌ను కలవని బాబు.. ప్రమాణ స్వీకారం వరకే

బాబు కేబినెట్లోకి ఫరూక్, శ్రవణ్‌లు: భావోద్వేగానికి గురైన శ్రవణ్ తల్లి

అరకు నుంచి అమాత్యుడిగా కిడారి శ్రవణ్

కొత్తమంత్రులకు శాఖలు కేటాయింపు, ప్రమాణ స్వీకారమే తరువాయి

చిన్నోడివైనా అవకాశం ఇచ్చా, మంచి పేరు తీసుకురా:శ్రవణ్ తో చంద్రబాబు

షరీఫ్‌కు మండలి ఛైర్మెన్, చాంద్ భాషాకు విప్

మంత్రి పదవి ఆశించా, కౌన్సిల్ చైర్మన్ అయినా ఒకే:షరీఫ్

మంత్రివర్గంలో మైనార్టీలకు చోటుపై చంద్రబాబు వివరణ

కిడారి కుమారుడికి మంత్రి పదవి.. తొలిసారి స్పందించిన శ్రవణ్