తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌తో సీఎం భేటీ అయ్యారు.

సుమారు 45 నిమిషాల పాటు సాగిన సమావేశంలో జగన్‌పై హత్యాయత్నం, సిట్ దర్యాప్తులో పురోగతిపై గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తిత్లీ తుఫాను నష్టం, కేంద్రం సాయంపై చర్చించినట్లు సమాచారం.

తిత్లీ తుఫానుకు కేంద్రం ఆశించిన స్ధాయిలో సాయం అందించలేదని.. అలాగే కడప స్టీల్ ఫ్లాంట్, విశాఖ మెట్రోల విషయంలోనూ మొండిచేయి చూపిందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రెండు ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని సీఎం.. గవర్నర్ వద్ద ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రానికి వివరించాలని చంద్రబాబు.. గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
 

ఏపీ కేబినెట్ విస్తరణ: కొత్త మంత్రుల శాఖలు ఇవే

జగన్‌పై దాడి ఎఫెక్ట్: గవర్నర్‌ను కలవని బాబు.. ప్రమాణ స్వీకారం వరకే

బాబు కేబినెట్లోకి ఫరూక్, శ్రవణ్‌లు: భావోద్వేగానికి గురైన శ్రవణ్ తల్లి