ఏపీ శాసనమండలి ఛైర్మె్న పదవికి ఎన్ఎండీ ఫరూక్ శనివారం నాడు రాజీనామా చేశారు.
అమరావతి: ఏపీ శాసనమండలి ఛైర్మె్న పదవికి ఎన్ఎండీ ఫరూక్ శనివారం నాడు రాజీనామా చేశారు. శాసనమండలి ఛైర్మెన్ పదవికి షరీఫ్ పేరును ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.
ఈ నెల 11వ తేదీన ఏపీ మంత్రివర్గాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విస్తరించనున్నారు. మైనార్టీల నుండి మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. గిరిజనుల నుండి కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్‌ను మంత్రివర్గంలో చోటు దక్కనుంది.
కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఎన్ఎండీ ఫరూక్‌కు ఎమ్మెల్సీ స్థానం కేటాయించడంతో పాటు ఎన్నికల తర్వాత శాసనమండలి ఛైర్మెన్ పదవిని ఫరూక్‌కు కేటాయించారు.
అయితే బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రుల రాజీనామాతో ఒక్క స్థానాన్ని మైనార్టీ ఎమ్మెల్యేతో భర్తీ చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. మైనార్టీ నేత ఎం. ఎ. షరీఫ్ కు మంత్రి పదవిని ఇవ్వాలని భావించారు.కానీ, రాయలసీమకు చెందిన మైనార్టీకి మంత్రి పదవి కేటాయించడం వల్ల రాజకీయంగా టీడీపీకి ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో షరీప్‌కు బదులుగా ఎన్ఎండీ ఫరూక్ ను మంత్రివర్గంలో తీసుకోనున్నారు. మైనార్టీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఫరూక్‌కు కేటాయించనున్నారు.
షరీఫ్‌కు శాసనమండలి ఛైర్మెన్ పదవి దక్కనుంది. చాంద్ భాషాకు ప్రభుత్వ విప్ పదవి దక్కనుంది. జలీల్ ఖాన్ కూడ మంత్రి పదవిని ఆశించారు. కానీ ఆయనకు వక్ప్‌బోర్డ్ ఛైర్మెన్ పదవిని ఇచ్చారు. మంత్రి పదవులు ఆశించి మంత్రి పదవులు దక్కని మైనార్టీ నేతలకు భవిష్యత్తులో మంచి పదవులు ఉంటాయని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు
మంత్రివర్గంలో మైనార్టీలకు చోటుపై చంద్రబాబు వివరణ
బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్
