మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలబడతానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా..ఈ హామీలో భాగంగా కిడారి తనయుడు శ్రవణ్ కి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. 

రేపు చంద్రబాబు ఏపీ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. ప్రస్తుతానికి రెండు మంత్రి పదవులు ఖాళీ ఉండగా.. వాటిని భర్తీ చేసేఅవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక మంత్రి పదవి  బాధ్యతలను శ్రవణ్ కి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. ఈ ప్రచారం పై తొలిసారిగా కిడారి తనయుడు శ్రవణ్ స్పందించాడు.

తనకు మంత్రి పదవి వస్తుందన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఈ విషయంపై మాట్లాడతానని ఆయన అన్నారు. 

related news

చంద్రబాబు కొలువులో అఖిలప్రియ కన్నా చిన్న మంత్రి