Asianet News TeluguAsianet News Telugu

AP Year Roundup 2019: సంక్షేమ పరుగులు, 80 శాతం హామీలు నెరవేర్చిన జగన్

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడు నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. ఇచ్చిన హామీల్లో తొలి 7 నెలల పాలనలోనే 80–90 శాతం అమలు చేశారు. 

AP Year Roundup 2019: ap cm YS Jaganmohan Reddy launches welfare schemes
Author
Amaravathi, First Published Dec 29, 2019, 5:56 PM IST

నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ పాదయాత్రలో రైతులు, విద్యార్థులు, పిల్లల్ని బడికి పంపే తల్లులు, నిరుద్యోగులు, కార్మికులు, మహిళలు.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, బ్రాహ్మణులు, ఇతర వర్గాల పేదలకు వరాల జల్లులు కురిపించిన సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడు నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. ఇచ్చిన హామీల్లో తొలి 7 నెలల పాలనలోనే 80–90 శాతం అమలు చేశారు. తొలి బడ్జెట్‌ సమావేశాల్లోనే చారిత్రాత్మకమైన 19 చట్టాలు చేసి చరిత్ర సృష్టిస్తే.. మొన్న శీతాకాల సమావేశాల్లో దశల వారీ మద్య నిషేధం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, మహిళలు, బాలికల మీద అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లో మరణ శిక్ష లాంటి 22 కీలకమైన చట్టాలను జగన్ ప్రభుత్వం చేసింది. 

మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు – అమలు:

1.‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌: 

– 2019 ఎన్నికల ముందు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ. 50 వేలు ఇస్తాం.. పంట వేసే సమయానికి మే నెలలో రూ. 12, 500 ఇస్తామని వాగ్దానం చేశాం. 
– ఇచ్చిన వాగ్దానం ప్రకారం..  2020 మే నుంచి అమలు చేయాలి. కానీ రైతుల కష్టాలను గుర్తించి 2019 అక్టోబరు నుంచే, రబీ సీజన్‌ నుంచే.. అదికూడా రైతులకు సాగు పెట్టుబడి కింద ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.67,500 ఆర్థిక సహాయం చేస్తున్నాం.
– దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మంది రైతులకు భరోసా లభిస్తుంది. 
– ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం, 

2. గ్రామ సచివాలయాలు–ఉద్యోగాల విప్లవం:

– గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా.. రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు. 
– ప్రజల పనులు/సమస్యలు 72 గంటల్లో పరిష్కారమయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు– పూర్తి స్థాయిలో జనవరి నుంచి ప్రారంభం.
– పూర్తి పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా 20 లక్షల మందికి సజావుగా పరీక్షలు  నిర్వహణ. 
– నాలుగు నెలలు నిండకుండానే 4.10 లక్షల ఉద్యోగాల కల్పన
–ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు. 
– గ్రామ వలంటీర్‌ ఉద్యోగాలు 2.75 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌.
– 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి దాదాపు 500 రకాల సేవలు

3) దశల వారీ మద్యపాన నిషేదం..

- తొలి ఏడాదే 20 శాతం మద్యం షాపులను తగ్గించి సర్కారీ మద్యం షాపులను తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. 
- ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అమ్మకాలు
- 44వేల బెల్టు షాపుల తొలగింపు
- రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే నిర్వహించే మద్యం దుకాణాల్లో 3,500 మంది సూపర్‌వైజర్లు, 8,033 మంది సేల్స్‌మెన్‌ల నియామకం ద్వారా ఉపాధి కల్పన.
– ప్రతి గ్రామ సచివాలయంలో మద్యం నియంత్రణకు ఓ మహిళా కానిస్టేబుల్‌ నియామకం.
–నూతన మద్యం షాపుల పాలసీ వల్ల... గత 2018 అక్టోబరుతో పోలిస్తే 2019 అక్టోబరు నాటికి.. ఆల్కహాల్‌ వినియోగం 25 శాతం పైన తగ్గింది. బీర్లు వినియోగం 55 శాతం పైన తగ్గింది.

4)వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక: 

-రూ. 1000 ఉన్న సామాజిక పింఛన్‌ మొత్తాన్ని ఏకంగా రూ. 2,250కు పెంపు, రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మందికి ప్రయోజనం
- వృద్ధుల పెన్షన్‌ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గింపు
- వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద వృద్ధులకు రూ. 2,250, వికలాంగులకు రూ. 3 వేలు పింఛన్‌.
- వచ్చే ఐదేళ్లలో పెన్షన్లను రూ.2250 నుంచి రూ.3 వేలకు పెంచే లక్ష్యం

5. వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా– వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ:

-దేశంలోనే తొలిసారిగా.. చికిత్స చేయించుకున్న తర్వాత.. ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లో రోగుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ. 
-చికిత్స చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఆర్థిక సహాయం.  వైద్యులు ఎన్నాళ్ళు సూచిస్తే.. అన్ని రోజులు సాయం.
– వార్షికాదాయం రూ.5 లక్షలలోపల ఉన్న కుటుంబాలకు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు. 
– ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు– జనవరి 1 నుంచి కొత్త కార్డులు జారీ. 1200 రోగాలకు పథకం విస్తరిస్తూ మార్పు. 
– హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఎక్కడ వైద్యం చేయించుకున్నా పథకం వర్తింపు.
– డయాలసిస్‌ చేయించుకునే వారు, తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్‌. ప్రమాదాల కారణంగా, పక్షవాతం వల్ల, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోధకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3,4,5) నెలకు రూ.5 వేల పింఛన్‌. కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేల పింఛన్‌.  
– విజయనగరం, పాడేరు, ఏలూరు, గురజాల, మచిలీపట్నం, మార్కాపురం, పులివెందులలో కొత్త ఆసుపత్రులు ఏర్పాటు

6) సామాజిక మార్పే లక్ష్యంగా అడుగులు:

-మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు.. నలుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
 – శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రంలో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ చట్టం. 
– ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం. 
– ప్రభుత్వ నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం. 
– తిరుమల తిరుపతి దేవస్థానం మినహా.. ఆలయ పాలక మండళ్ళలో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు.

7) మన బడి నాడు–నేడు

– ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌–1982 సవరణ  
– ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యార్థులకు భోదన.. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం.. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదం చేయడం.. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం. 
– వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మిడియం
–1 నుంచి 6వ తరగతి వరకూ వచ్చే ఏడాది ఇంగ్లీషు మీడియం అమలు. ఆ తర్వాత ఏడాది 7వ తరగతి.. అలా వచ్చే నాలుగేళ్ళలో 10వ తరగతి వరకు మొత్తం ఇంగ్లీషు మీడియంగా మార్పు.
– 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్‌లో రాసేలా చట్టం. ఇది ఒక చరిత్రాత్మక బిల్లు. 
– ప్రస్తుతం పాఠశాలల ఫొటోలు తీసి.. అభివృద్ధి చేశాక ఫొటోలతో తేడా చూపుతారు.

8) అవినీతిపై యుద్ధం:

–అవినీతి లేని సుపరిపాలన కోసం.. ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం.
– రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు 14400 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు. 
– ఈ నంబర్‌కు ఫోన్‌ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి.. చర్యలు. 

9) రివర్స్‌ టెండరింగ్‌ – జ్యుడీషియల్‌ రివ్యూ

రివర్స్‌ టెండరింగ్‌ విధానం, రూ. 100 కోట్లు దాటితే న్యాయమూర్తి నేతృత్వంలో నియమించిన జ్యుడీషియల్‌ ప్రివ్యూ ద్వారా దేశంలో మరెక్కడా లేని విధంగా.. ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నారు. 

10) ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం 

–మేనిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రకారం.. ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఏకంగా చారిత్రాత్మకమైన చట్టం
– సుమారు 51,488 మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ... వీరంతా జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణిలోకి.
– ఆర్టీసీలో రిటైర్మెంట్‌ వయసు 58 ఏళ్లే. రిటైర్మెంట్‌ వయస్సు 60 ఏళ్లకు పెంపు

11) మృగాళ్లకు మరణ శాసనం – ‘ఏపీ దిశ చట్టం’

– మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే వారికి మరణ శాసనం లిఖించేలా, 21 పనిదినాల్లోనే తీర్పు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
– మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్షే
– 21 పనిదినాల్లో తీర్పు.. 7 పనిదినాల్లోనే దర్యాప్తు పూర్తి.. 14 పనిదినాల్లో న్యాయ విచారణ
– పిల్లలపై లైంగిక వేధింపులకు గరిష్టంగా జీవిత ఖైదు..
– సోషల్‌ మీడియాలో మహిళల్ని వేధిస్తే 2 నుంచి 4 ఏళ్ల జైలు
– ఇందుకోసం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ క్రిమినల్‌ లా చట్టం– 1973ను ఏపీకి వర్తింప చేయడంతో పాటు, అందులో అవసరమైన సవరణల చేస్తూ రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు–2019’ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. 

12) స్పందన 
– ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం.
– ఎప్పటిలోగా సమస్య పరిష్కరిస్తారో సూచిస్తూ ప్రతి అర్జీకి రశీదు తప్పనిసరి.
– ప్రతి వారం ‘స్పందన’ అమలు తీరుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష .

13) అగ్రిగోల్డ్‌:

– అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి రాగానే.. తొలి బడ్జెట్‌ సమావేశాల్లో రూ. 1150 కోట్లు సీఎం కేటాయించారు.
– తొలి విడతగా 2019–20 బడ్జెట్‌ లో రూ. 1150 కోట్లు కేటాయించి రూ. 10 వేల లోపు డిపాజిట్‌ దారులకు 3, 69,655 మందికి రూ. 264 కోట్లు పంపిణీ

14) వైఎస్సార్‌ నేతన్న నేస్తం:

– ఈ పథకం ద్వారా సొంతంగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం
–నేతన్న నేస్తం ద్వారా రాష్ట్రంలో 85 వేల కుటుంబాలకు రూ.196 కోట్లకు పైగా సాయం
– కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నప్పటికీ ఒక యూనిట్‌గానే తీసుకుని రూ.24 వేలు అందిస్తారు. 

15) వైఎస్సార్‌ వాహన మిత్ర:
- ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ 10 వేలు చొప్పున సాయం..
– ఈ డబ్బును వాహనాల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలి.  
– తొలిరోజే 1,75,352 మంది డ్రైవర్లకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ.    రెండు విడతల్లో రూ.236 కోట్లతో 2,36,343 మందికి ఆర్థిక సహాయం.   

16) వైఎస్సార్‌ మత్స్యకార భరోసా:
– ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు రెండు నెలలు చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి ఇచ్చే సహాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. తద్వారా రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి.
–చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్ళ లోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి మత్స్యకార భరోసా పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం. 
– మర పడవల నిర్వాహకులకు ఇస్తున్న డీజిల్‌ రాయితీ లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంపు

17) వైఎస్సార్‌ లా నేస్తం

– లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లకు వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్లపాటు నెలకు రూ.5 వేల సాయం.

18) వైఎస్సార్‌ కంటి వెలుగు:

– రాష్ట్రంలోని 5.4 కోట్ల ప్రజలకు వివిధ దశల్లో ఉచితంగా కంటి పరీక్షలు అవసరమైన వారికి శస్త్రచికిత్స, కళ్లద్దాల పంపిణీ. ఇందు కోసం వచ్చే రెండున్నర ఏళ్లలో రూ.560 కోట్ల వ్యయం. తొలి, మలి దశల్లో విద్యార్థులకు కంటి పరీక్ష. 
- 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీ బేస్‌ ఆధారంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు 
మొదలవుతాయి. 

19) వైయస్‌ఆర్‌ నవశకం:

- వైయస్‌ఆర్‌ నవశకం పేరుతో డిసెంబరు నెల 20 నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. 
–  ఈ కార్యక్రమం కింద కొత్తగా బియ్యం కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన – జగనన్న వసతి దీవెన కార్డులను జారీ చేస్తారు. 
– జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ కాపు నేస్తం.. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల ఆర్థిక సాయం.. అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌ల గుర్తింపు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, లా నేస్తం లబ్ధిదారులను ఎంపిక చేశారు.

20) వేతనాలు పెంపు:

– ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. 
– మున్సిపాల్టీల్లో  పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు జీతం  రూ. 18 వేలకు పెంపు
–బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంపు. 
–హోం గార్డులకు రూ.18వేల నుంచి  రూ.21 వేలకు పెంపు.  
– వీవోఏ(వెలుగు యానిమేటర్లు) వేతనం రూ.3 వేల నుంచి 10 వేలకు పెంపు.  
–108 పైలెట్‌(డ్రైవర్‌)కు ప్రస్తుతం రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌)కి ప్రస్తుతం రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని 
రూ.30 వేలకు పెంచారు.
–  104 వాహన ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం ఉండగా, దానిని రూ.26 వేలకు పెంచారు.  
–మధ్యాహ్నభోజన కార్మిలకు నెలకు రూ.1000నుంచి రూ.3 వేలు జీతం పెంచుతూ నిర్ణయం
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌

21) పేదలకు నాణ్యమైన బియ్యం:

– నాణ్యత పెంచిన, తినగలిగిన బియ్యం రేషన్‌ షాపుల ద్వారా సరఫరా.
– గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పేద ప్రజల ఇంటి వద్దనే పంపిణీ. 
– నాణ్యత కలిగిన నిత్యావసర సరుకుల సరఫరా. 

22) కొత్త ఇసుక పాలసీ:

-దోపిడీ తీరుకు భిన్నంగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కొత్త ఇసుక పాలసీ అమలు. 
– ఎక్కడా అవినీతికి తావు లేకుండా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాల ఏర్పాటు. 
– ఇసుక వారోత్సవంలో రూ.60 కోట్లు ఆదాయం.

23) వైఎస్సార్‌ నవోదయం

– లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి. 
– సంక్షోభంలో ఉన్న సంస్థల పునరుద్ధరణతో పాటు, వాటి స్థిరీకరణలో తోడ్పాటు అందించడం పథకం లక్ష్యం.
–‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ’ (ఎంఎస్‌ఎంఈ), రుణాల ఏకకాల పునర్‌వ్యవస్థీకరణ (ఓటీఆర్‌).
– ఈ పథకం కోసం రూ.10 కోట్లు విడుదల 

24) బాక్సైట్‌ కు నో:
– విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలకు గతంలో ఇచ్చిన అనుమతి రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ 

25) ‘వైయస్సార్‌ రైతు దినోత్సవం’:

– మహానేత వైయస్సార్‌ జయంతి జులై 8ను వైయస్‌ఆర్‌ రైతు దినోత్సవంగా అమలు
–‘రైతే రాజుగా రాజన్న రాజ్యం–వ్యవసాయ ప్రగతి ప్రభుత్వ లక్ష్యం’ పేరుతో కార్యక్రమాన్నిప్రారంభించిన ప్రభుత్వం.

26) స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు:
–పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చట్టం.

27) పోలీసులకు వీక్లీ ఆఫ్‌ 
– పోలీసులకు దేశంలోనే మొదటి సారిగా వీక్లీ ఆఫ్‌ (వారంలో ఒక రోజు సెలవు) సౌకర్యం

28) ‘వైయస్సార్‌ సంపూర్ణ పోషక పథకం’:
– రాష్ట్రంలోని ఏడు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు, 77 షెడ్యూల్డ్, గిరిజన మండలాల్లో పథకం అమలు
– ప్రస్తుతం అమలులో ఉన్న పోషక ఆహార పథకాన్ని పరిశీలించి మహిళలు, పిల్లలకు మరింత పోషకాహారం అందించడం లక్ష్యం
–ఎస్సీలు, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ పరిమితిని 100 నుంచి 200 యూనిట్లకు పెంపు

29) ‘వన మహోత్సవం’:
– ఈ ఒక్క సీజన్‌లోనే 4 కోట్ల మొక్కలు నాటగా, వన మహోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించిన సీఎం.
– మొక్కల పెంపకం కార్యక్రమంలో పండ్ల చెట్లు, నీడనిచ్చే చెట్లు, ఎర్ర చందనం, టేకు మొక్కలు.. ఇలాంటివి అక్షరాలా 12 కోట్ల మొక్కలు నాటడానికి అటవీ శాఖ సిద్ధం
– మరో 13 కోట్ల మొక్కలను పట్టు పరిశ్రమ శాఖ, ఉద్యానవన శాఖతో పాటు, పేపర్‌ మిల్లులు మొక్కలు నాటుతాయి

30) ఫీజు మానిటరింగ్‌ కమిటీలు
– రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లు, విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై.. మానిటరింగ్‌ కమిటీల ఏర్పాటు. తద్వారా ఫీజుల నియంత్రణకు చర్యలు

31) రోల్డ్‌ గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్లకు కరెంటు ఛార్జీలు తగ్గింపు
–ఆయా కంపెనీలకు యూనిట్‌ విద్యుత్‌ రేటు రూ.9.20 నుంచి రూ.375కు తగ్గింపు
– కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దాదాపు 250 రోల్డ్‌ గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్లకు ప్రయోజనం
– ఆయా కంపెనీల నుంచి తక్కువ విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేయడం వల్ల ఎదురయ్యే నష్టాలను పూడ్చేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏపీ ఇంధన శాఖ సబ్సిడీ విడుదల చేస్తుంది. 

32) ఎస్సీ కమిషన్‌  
- ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం.
– ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా రెండు కమిషన్లు 

33) ఎస్టీ కమిషన్‌   
-ఎస్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం. 

34) చిరుధాన్యాల(మిల్లెట్స్‌) బోర్డు ఏర్పాటు 
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం. 

35) పప్పుధాన్యాల(పల్సస్‌) బోర్డు ఏర్పాటు 
పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగడకుండా నియంత్రించడం.. 
ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం. 

36) ఆంధ్రప్రదేశ్‌ మద్యనిషేధ చట్టం–1995కు సవరణ :
అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.రెండు లక్షల జరిమానా.. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.5 లక్షల జరిమానా. 

37) ఆంధ్రప్రదేశ్‌ ఆబ్కారీ చట్టం–1968కు సవరణ 
- బార్‌లలో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయం.. సరిహద్దుల నుంచి అక్రమ రవాణా.. ఇలాంటి నేరాలకు తొలిసారి పాల్పడితే హెచ్చరికతోపాటు లైసెన్స్‌ ఫీజుకు రెండు రెట్లు జరిమానా.. 
– రెండోసారి పాల్పడితే బార్‌ లైసెన్స్‌ రద్దు, నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు.

38) కర్నూలులో క్లస్టర్‌ యునివర్సిటీ ఏర్పాటు :
-కర్నూలులో సిల్వర్‌ జూబ్లీ కాలేజీ, కేవీఆర్‌ ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం.. విద్యార్థులకు ఉపాధి కల్పన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచేలా నాణ్యమైన విద్యను అందించడం. 

39) జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం చట్టం సవరణ  
-వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేయడం.  

40) ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు
-విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌/ప్రతినిధి ఎక్స్‌–అఫీషియో సభ్యునిగా నియామకం. 

41) ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టాల రెండో సవరణ బిల్లు 
-విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్‌ (ఉప కులపతులు)ల నియామక నిబంధనల్లో మార్పులు 

42) ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘాల రెండో సవరణ బిల్లు 
-సహకార సంఘాల పాలక మండలి ఎన్నికల్లో కుష్టు వ్యాధిగ్రస్తులు, మూగ, చెవిటి వారికి పోటీ చేసే అవకాశం కల్పించడం. 

43) ఏపీ వృత్తిదారులు, వ్యాపారులు, ఉద్యోగుల వృత్తిపన్ను చట్టం సవరణ బిల్లు–2019 
44) ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు–2019 
45) ఏపీ మున్సిపల్‌ చట్టం సవరణ బిల్లు–2019   

Follow Us:
Download App:
  • android
  • ios