ఐటం బాంబ్ సన్నీలియోన్ కొత్త బిజినెస్.. కేవలం 10 లక్షలతో 10 కోట్లు..
ముంబై : మాజీ పోర్న్ స్టార్, ఐటం బాంబ్ సన్నీ లియోన్ కాస్మెటిక్స్ బ్రాండ్ స్టార్‌స్ట్రక్ అన్యువల్ టర్నోవర్ రూ.10 కోట్లు దాటిందని తెలిపారు. సన్నీ లియోన్‌గా పేరుగాంచిన కరణ్‌జీత్ కౌర్ వోహ్రా కెనడాకు చెందినది. ఆమె 2018లో స్టార్‌స్ట్రక్ పేరుతో కాస్మెటిక్ బ్రాండ్‌ను ప్రారంభించింది.
ఇందుకోసం 10 లక్షలు పెట్టుబడి పెట్టారు. 2019లో తన వ్యాపారాన్ని లోదుస్తుల రంగానికి విస్తరించింది. ఇందుకోసం తన భర్త డేనియల్ వెబర్ సహాయం కూడా తీసుకున్న సన్నీ లియోన్ ఇన్‌ఫేమస్ బై స్టార్‌స్ట్రక్ పేరుతో వ్యాపారాన్ని ఇన్నర్‌వేర్‌కు విస్తరింపజేసింది. 'నేను ఏదైనా కంపెనీకి బ్రాండ్ ఫేస్‌గా ఉండాలనుకున్నాను. అయితే, నా రీచ్ అండ్ ఫాలోవర్స్ పెద్దగా ఉన్నప్పటికీ, చాలా కంపెనీలు నన్ను తమ బ్రాండ్ ఫేస్‌గా మార్చడం రిస్క్ అని భావించాయి. ఆ తర్వాత సొంతంగా కంపెనీ ప్రారంభించాను' అని సన్నీలియోన్ తెలిపింది.
ప్రస్తుతం, స్టార్‌స్ట్రక్ 260 కంటే ఎక్కువ విభిన్న ఉత్పత్తులను అందిస్తుంది. ఈ కాస్మెటిక్స్ తయారీకి ఎలాంటి జంతు వధ జరగలేదని కంపెనీ పేర్కొంది.
Sunny Leone
స్టార్‌స్ట్రక్ కంపెనీని నిర్మించే ప్రయాణం నిదానంగా, స్థిరంగా సాగిందని ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అనుభవాలు ఉన్నాయని సన్నీ లియోన్ అన్నారు. 42 ఏళ్ల మాజీ బ్లూ ఫిల్మ్ స్టార్ షార్ట్కట్లు లేకుండా స్వంత కంపెనీని నిర్మించడం, నడపడం అంత సులభం కాదని అన్నారు. సన్నీ లియోన్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో విజయవంతమైన వెంచర్లలో పెట్టుబడి పెట్టింది. సన్నీ లియోన్ నెట్ వాల్యూ నేడు 100 కోట్లకు పైగా ఉంది.
మా కంపెనీ పెర్ఫ్యూమ్ లైన్ Affetto Fragrances భారతదేశం అంతటా 500 స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. "సింపుల్ గా చెప్పాలంటే, నాకు కలర్ కాస్మెటిక్స్ అంటే చాలా ఇష్టం. ఇది మార్కెట్లో అతిపెద్ద కేటగిరీ" అని కూడా చెప్పింది.
2021లో సన్నీ లియోన్ పెటా ఆమోదించిన అథ్లెషర్ బ్రాండ్ ఐ యామ్ యానిమల్, రైజ్ బార్స్ అనే వెల్నెస్ బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సన్నీ నోయిడాలో చికా లోకా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించింది.