తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్, క్రీడల ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:26 AM (IST) Jun 25
Ben Duckett: బెన్ డకెట్ అద్భుత సెంచరీ, జో రూట్-స్మిత్ భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ 371 పరుగుల లక్ష్యాన్ని చేధించి భారత్‌పై తొలి టెస్టులో గెలుపొందింది.
11:51 PM (IST) Jun 24
Revanth Reddy: తెలంగాణలో రైతు భరోసా కింద 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.
11:37 PM (IST) Jun 24
India vs England: భారత్ ఉంచిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దీంతో బెన్ స్టోక్స్ టీమ్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
10:35 PM (IST) Jun 24
PM Modi: ప్రధాని మోడీతో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగూలాం ఫోన్‌లో సంభాషించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలనే విషయాన్ని పునరుద్ఘాటించారని ప్రభుత్వ వర్గాలు తెలపాయి.
09:22 PM (IST) Jun 24
Revanth Reddy: తెలంగాణలో రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని, అయినా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎలా సంపన్నులయ్యారనే ప్రశ్నను లేవనెత్తారు.
08:48 PM (IST) Jun 24
మెగా మదర్ అంజనాదేవి అనారోగ్యానికి గురయినట్టు వస్తున్న వార్తలపై స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు నాగబాబు.
08:27 PM (IST) Jun 24
ఇప్పటికే కేసుల మీద కేసులు నమోదవుతున్న వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తాజాగా ఆయన కార్యాలయానికి వచ్చిమరీ కారును సీజ్ చేశారు పోలీసులు.
08:04 PM (IST) Jun 24
AP Cabinet's Crucial Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి భూసేకరణ, పొగాకు రైతుల సహాయం, పర్యాటక అభివృద్ధికి కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
07:24 PM (IST) Jun 24
India vs England: లీడ్స్ టెస్టు చివరి రోజున భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు ధరించి మ్యాచ్ ఆడారు. ఎందుకు ఇరు జట్ల ప్లేయర్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు.
06:30 PM (IST) Jun 24
SBI Recruitment : ఎస్‌బీఐ పీవో ఉద్యోగాల కోసం 541 ఖాళీలకు రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 24 నుంచి జూలై 14 వరకు కొనసాగనున్నాయి.
05:55 PM (IST) Jun 24
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి మరణించడంపై షర్మిల స్పందించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కాదు పబ్లిసిటీ కోసమే జగన్ ప్రజల్లోకి వస్తున్నాడని… ఇందుకోసం అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
05:32 PM (IST) Jun 24
సొంతిల్లు ప్రతీ ఒక్కరికి కల. ఒకప్పుడు అందని ద్రక్షలా ఉన్న సొంతిల్లు హోమ్ లోన్స్ వచ్చాక సులభమయ్యాయి. అయితే మనలో చాలా మందికి హోమ్ లోన్‌కు సంబంధించిన చిట్కాలు తెలియవు. హోమ్ లోన్ ను త్వరగా క్లోజ్ చేయడానికి పాటించాల్సిన ఒక ట్రిక్ మీకోసం.
04:45 PM (IST) Jun 24
డిజిటల్ లావాదేవీలు పెరిగిన ప్రస్తుత తరుణంలో కూడా ఏటీఎమ్‌లను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎమ్ ఛార్జీల విషయంలో బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
03:59 PM (IST) Jun 24
మంచి బైక్, కాస్లీ ఫోన్, స్టైలిష్ దుస్తులు.. ఇదీ యువత ఆలోచించే విధానం. ఇందుకోసం అప్పులు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ ఆలోచన మారుతోంది. అప్పు చేసి పప్పు కూడు మాకొద్దని అంటున్నారు.
03:14 PM (IST) Jun 24
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్ పడినట్లు వార్తలు వచ్చాయి. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
03:11 PM (IST) Jun 24
నాలుగు నెలల క్రితం చోటుచేసుకున్న వ్యవహారంలో వైసిపి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఇంతకీ కేసు ఏంటో తెలుసా?
02:34 PM (IST) Jun 24
తెలంగాణ విద్యార్థులకు జూలైలో బాగానే సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో కొన్ని ప్లాన్డ్ సెలవులు వస్తుండగా మరికొన్ని సడన్ హాలిడేస్ వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా వచ్చేనెలలో ఎన్ని సెలవులు వస్తాయంటే…
01:46 PM (IST) Jun 24
వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ పెట్టుబడికి ఆలోచించి వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో కూడా మంచి లాభాలు ఆర్జించే మార్గాలు ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
12:40 PM (IST) Jun 24
హైదరాబాద్ ఆషాడ బోనాల కోసం సర్వం సిద్దమయ్యింది. తెెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన కేబినెట్ మొత్తం బోనాాల వేడుకల్లో సందడి చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే మంత్రుల షెడ్యూల్ ఖరారయ్యింది.
12:17 PM (IST) Jun 24
హైదరాబాద్ నగరంలో మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుందని టీఎస్‌ఎస్పీడీసీఎల్ (TSSPDCL) అధికారులు ప్రకటించారు. వీరి వివరాల ప్రకారం ఏయే ప్రాంతాల్లో పవర్ కట్ ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
11:28 AM (IST) Jun 24
దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటి హైదరాబాద్. ఇక్కడ భుముల ధరలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల రియల్ ఎస్టేట్ కాస్త బూమ్ తగ్గిందన్న వార్తలు వచ్చాయి. కానీ తాజాగా నిర్వహించిన ఓ వేలంలో కళ్లు చెదిరే రేటు వచ్చింది.
10:29 AM (IST) Jun 24
ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం మరోసారి గోల్డ్ రేట్స్‌లో తగ్గుదుల కనిపించింది.
10:09 AM (IST) Jun 24
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడంలేదు.. మరో నాలుగైదు రోజులు చిరుజల్లులే ఉంటాయట. అంటే జూన్ లో ఇక హెవీ రెయిన్స్ లేనట్లే. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే…
09:42 AM (IST) Jun 24
ఏపీ ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పాఠశాల చేర్పు డ్రైవ్, సాగునీటి బిల్లులు, విమానాశ్రయ కమిటీపై నిర్ణయాలు తీసుకుంది.
07:49 AM (IST) Jun 24
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరుదేశాల మధ్య యుద్దం ముగిసిందని ట్రంప్ ప్రకటించారు.