India vs England: లీడ్స్ టెస్టు చివరి రోజున భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు ధరించి మ్యాచ్ ఆడారు. ఎందుకు ఇరు జట్ల ప్లేయర్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు.
India vs England: లీడ్స్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ చివరి రోజుకు చేరుకుంది. భారత జట్టు విజయం సాధించాలంటే 10 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. కాగా ఇంగ్లాండ్ జట్టు గెలవాలంటే భారత్ ఉంచిన 350+ పరుగులు టార్గెట్ ను అందుకోవాలి. మేఘాలతో కూడిన వాతావరణంలో మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, భారత్-ఇంగ్లాండ్ ప్లేయర్లు చివరిరోజు మ్యాచ్ ఆటలో చేతులకు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు కట్టుకుని కనిపించారు. ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ప్లేయర్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు ఎందుకు ధరించారు?
భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు టెస్ట్ చివరి రోజున బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు ధరించి ఆడారు. భారత జట్టు మాజీ స్పిన్నర్ దిలీప్ జోషి హృదయ సంబంధిత సమస్యలతో లండన్‌లో సోమవారం (జూన్ 23) మరణించారు. ఆయన మరణానికి సంతాపంగా ఆట ప్రారంభానికి ముందు రెండు జట్లు మౌనం పాటించాయి. అలాగే, ఆయనకు నివాళిగా ప్లేయర్లు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించారు.
బీసీసీఐ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది. భారత మాజీ స్పిన్నర్ దిలీప్ జోషి మరణానికి బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం” అని పేర్కొంది.
ఎవరీ దిలీప్ జోషి?
దిలీప్ దోషి 77 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన 1968లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. 1986 వరకు క్రికెట్ లో కొనసాగారు. 238 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లను ఆడి మొత్తం 898 వికెట్లు తీశారు. అలాగే, 33 టెస్ట్ మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి దిలీప్ జోషి 114 వికెట్లు పడగొట్టారు. అలాగే, 15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు. స్పిన్ బౌలింగ్‌లో తనదైన ముద్ర వేసిన దిలీప్ జోషి.. భారత క్రికెట్‌లో విలక్షణమైన పాత్ర పోషించారు.
టార్గెట్ ను అందుకునే దిశగా ఇంగ్లాండ్..చరిత్ర సృష్టించిన క్రాలీ-డకెట్ జోడీ
చివరి రోజు భారత బౌలర్లు వికెట్లు తీసుకోవడానికి తీవ్రంగా కష్టపడ్డారు. అయితే, పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారడంతో ఇంగ్లాండ్ విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే నాల్గో ఇన్నింగ్స్‌లో రికార్డు ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ నమోదైంది.
ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ లీడ్స్ టెస్ట్‌లో నాల్గో ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇవాళ ఉదయం సెషన్‌లో భారత బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ వికెట్ కోల్పోకుండా 96 పరుగులు చేశారు. లంచ్ సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 117/0గా ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమాయానికి ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 181 పరుగు చేసింది. గెలుపునకు ఇంకా 190 పరుగులు కావాలి.
క్రాలీ-డకెట్ జోడీ, 1949లో న్యూజిలాండ్ ఆటగాళ్లు వెర్డన్ స్కాట్, బర్ట్ సట్‌క్లిఫ్ నెలకొల్పిన 112 పరుగుల రికార్డును అధిగమించారు. క్రాలీ-డకెట్ 181 పరుగులతో హెడ్డింగ్లీ వేదికపై నాల్గో ఇన్నింగ్స్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు.
నాల్గో ఇన్నింగ్స్ టాప్ 5 ఓపెనింగ్ స్టాండ్‌లు
1. జాక్ క్రాలీ & బెన్ డకెట్: 181* పరుగులు vs భారతదేశం, 2025
2. వెర్డన్ స్కాట్ & బర్ట్ సట్‌క్లిఫ్: 112 పరుగులు vs ఇంగ్లాండ్, 1949
3. గార్డన్ గ్రీనిడ్జ్ & డెస్మండ్ హేన్స్: 106 పరుగులు vs ఇంగ్లాండ్, 1984
4. గ్రేమ్ ఫౌలర్ & క్రిస్ టవారే: 103 పరుగులు vs పాకిస్తాన్, 1982
5. జెఫ్ డుజాన్ & డెస్మండ్ హేన్స్: 67* పరుగులు vs ఇంగ్లాండ్, 1988
క్రాలీ-డకెట్ జోడీకి 2000 ఓపెనింగ్ పరుగుల మైలురాయి
ఈ మ్యాచ్ ద్వారా క్రాలీ-డకెట్ జోడీ 2000 ఓపెనింగ్ పరుగుల మైలురాయిని దాటింది. ఇది ఇంగ్లాండ్‌కు చెందిన 8వ ఓపెనింగ్ జంటగా మారింది. అలాస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్స్ 4711 పరుగులతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.
కష్టాల్లో భారత బౌలింగ్
భారత బౌలర్లు మేఘావృత వాతావరణంలో కొత్త బంతిని ఉపయోగించడానికి ప్రయత్నించినా, తొలి సెషన్‌లో విజయవంతం కాలేకపోయారు. బంతికి స్వింగ్ తక్కువగా ఉండటం వల్ల ఇంగ్లాండ్ ఓపెనర్లు జాగ్రత్తగా ఆడారు. రెండు, మూడో సెషన్‌లో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్‌కు విజయానికి అవసరమైన పరుగులు ఇంకా 190 మాత్రమే ఉన్నాయి.
