Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలుసా?
ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం మరోసారి గోల్డ్ రేట్స్‌లో తగ్గుదుల కనిపించింది.

బంగారంపై అంతర్జాతీయ పరిస్థితులు
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు, అమెరికా డాలర్ మారకం విలువలో ఊగిసలాట ఇవన్నీ బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ కారణాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని అంతా భావించారు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా కనిపించింది. బంగారం ధరలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఒత్తిడి
అంతర్జాతీయంగా గతవారం అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేపట్టిన దాడులు, ముఖ్యంగా ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై జరిగిన వైమానిక దాడులు, బంగారం రేట్లను పెంచే అవకాశం ఉన్నప్పటికీ, అంచనాలకు విరుద్ధంగా బంగారం ధర 0.27% తగ్గింది. అయితే ఈ తగ్గుదల నామ మాత్రమే అయినప్పటికీ బంగారంపై ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడుతున్నారు.
భారతదేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం మధ్యాహ్నానికి బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ధరలు కేవలం 0.06% తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి బలహీనత కూడా ఈ ధరలకు కొంత స్థిరతను కలిగించింది. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడిలో ఉన్నా, దేశీయంగా గణనీయమైన పతనం చోటుచేసుకోలేదు. కాగా మంగళవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
బంగారం ధరలు..
మంగళవారం దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపంచింది. 10 గ్రాముల 24 క్యారెట్లపై ఒకే రోజు రూ. 820 తగ్గింది. దీంతో తులం ధర రూ. 99,870కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై రూ. 750 తగ్గి రూ. 91,550 వద్ద కొనసాగుతోంది.
* ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,870గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,550 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 99,870గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,550గా ఉంది.
* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 99,870గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,550 వద్ద కొనసాగుతోంది.
* ఇతర నగరాలతో పోల్చితే ఢిల్లీలో బంగారం ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100020గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,700 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి.?
* విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,870గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,550 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 99,870గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,550 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,870గా ఉండగా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 91,550గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.?
వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. దీంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,09,000కి చేరింది. అయితే చెన్నై, హైదరాబాద్, కేరళ వంటి నగరాల్లో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 1,19,000 వద్ద కొనసాగుతోంది.