- Home
- Jobs
- SBI Recruitment: 80 వేల వేతనంలో ఎస్‌బీఐ జాబ్ నోటిఫికేషన్.. రిజిస్ట్రేషన్, ఫీజు వివరాలు మీకోసం
SBI Recruitment: 80 వేల వేతనంలో ఎస్‌బీఐ జాబ్ నోటిఫికేషన్.. రిజిస్ట్రేషన్, ఫీజు వివరాలు మీకోసం
SBI Recruitment : ఎస్‌బీఐ పీవో ఉద్యోగాల కోసం 541 ఖాళీలకు రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 24 నుంచి జూలై 14 వరకు కొనసాగనున్నాయి.

ఎస్‌బీఐ పీవో రిక్రూట్మెంట్ 2025-26 ప్రకటన విడుదల.. దరఖాస్తు ప్రక్రియ షురూ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2025-26 సెషన్‌కు సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. జూన్ 24న అధికారికంగా విడుదలైంది. మొత్తం 541 ఖాళీలను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. అందులో 500 పోస్టులు సాధారణ ఖాళీలు కాగా, మిగిలిన 41 బ్యాక్లాగ్ ఖాళీలుగా ఉన్నాయి.
ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ (https://sbi.co.in లేదా https://bank.sbi) సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 24 నుండి ప్రారంభమై జూలై 14, 2025 వరకు కొనసాగుతుంది.
ఎస్‌బీఐ పీవో రిక్రూట్మెంట్ 2025-26: ముఖ్య తేదీలు
• ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: జూన్ 24 నుండి జూలై 14, 2025
• అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూలై 14, 2025
• ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్: జూలై చివరి వారంలో లేదా ఆగస్ట్ మొదటి వారంలో అందుబాటులో ఉంటుంది.
• ఫేజ్ I: ప్రిలిమినరీ పరీక్ష: జూలై / ఆగస్ట్ 2025
• ప్రిలిమ్స్ ఫలితాలు: ఆగస్ట్ / సెప్టెంబర్ 2025
ఎస్‌బీఐ పీవో రిక్రూట్మెంట్ 2025-26: మెయిన్స్ ముఖ్య తేదీలు
• మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు: ఆగస్ట్ / సెప్టెంబర్ 2025
• ఫేజ్ II: మెయిన్ ఎగ్జామ్: సెప్టెంబర్ 2025
• మెయిన్ ఫలితాలు: సెప్టెంబర్ / అక్టోబర్ 2025
• ఫేజ్ III హాల్ టికెట్లు (ఇంటర్వ్యూ): అక్టోబర్ / నవంబర్ 2025
• సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ: అక్టోబర్ / నవంబర్ 2025
• తుది ఫలితాలు: నవంబర్ / డిసెంబర్ 2025
SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: జూలై / ఆగస్ట్ 2025 లో ఉండనుంది.
ఎస్‌బీఐ పీవో రిక్రూట్మెంట్ 2025-26: అర్హత ప్రమాణాలు
ఎస్‌బీఐ పీవో రిక్రూట్మెంట్ 2025-26: విద్యార్హత
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
2025 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంది.
ఎస్‌బీఐ పీవో రిక్రూట్మెంట్ 2025-26: ఎంపిక విధానం
ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది
1. ప్రిలిమినరీ పరీక్ష - ఆబ్జెక్టివ్ టెస్ట్, 100 మార్కులు, మూడు విభాగాలు, సెక్షన్ ఆధారిత టైమ్‌లిమిట్ ఉంటుంది. సెక్షనల్ కట్-ఆఫ్ ఉండదు.
2. మెయిన్ పరీక్ష - డిస్క్రిప్టివ్ టెస్ట్‌తో పాటు ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది.
3. ఇంటర్వ్యూకు హాజరు - సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌లు, వ్యక్తిగత ఇంటర్వ్యూతో ఉంటుంది.
ప్రతి దశలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు మెయిన్‌కు, మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూకు అర్హులవుతారు.
ఎస్‌బీఐ పీవో రిక్రూట్మెంట్ 2025-26: దరఖాస్తు విధానం
1. అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in) ను సందర్శించండి.
2. 'Careers' సెక్షన్ లోకి వెళ్లి, SBI PO 2025 రిక్రూట్మెంట్ లింక్‌ను క్లిక్ చేయండి.
3. రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసిన తర్వాత, వివరాలు నమోదు చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ పొందండి.
4. అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయడి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
5. ఫీజు చెల్లించండి, ఫారమ్ సమర్పించండి.
6. భవిష్యత్తులో ఉపయోగం కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.
ఎస్‌బీఐ పీవో రిక్రూట్మెంట్ 2025-26: దరఖాస్తు ఫీజు వివరాలు
• జనరల్ / OBC / EWS కేటగిరీకి: రూ. 750
• SC / ST / PwBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అభ్యర్థులకు అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులో స్థిరమైన ఉద్యోగాన్ని కోరుకునే అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. SBI PO (ప్రొబేషనరీ ఆఫీసర్) కి ప్రారంభ నెల జీతం రూ. 84,000 నుండి రూ. 85,000 వరకు ఉంటుందని సమాచారం. రూ. 48,480 మూల వేతనం వుండగా, ఇందులో వివిధ అలవెన్సులు ఉంటాయి. ప్లేస్, ఇతర అంశాల ఆధారంగా ఇది మారవచ్చు.