Home Loan: హోమ్ లోన్ త్వరగా ఎలా క్లోజ్ చెయ్యాలి.? ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే సరి
సొంతిల్లు ప్రతీ ఒక్కరికి కల. ఒకప్పుడు అందని ద్రక్షలా ఉన్న సొంతిల్లు హోమ్ లోన్స్ వచ్చాక సులభమయ్యాయి. అయితే మనలో చాలా మందికి హోమ్ లోన్‌కు సంబంధించిన చిట్కాలు తెలియవు. హోమ్ లోన్ ను త్వరగా క్లోజ్ చేయడానికి పాటించాల్సిన ఒక ట్రిక్ మీకోసం.
- FB
- TW
- Linkdin
Follow Us

ముందుగా క్లోజ్ చేస్తే మంచిదేనా.?
మనలో చాలా మంది హోమ్‌లోన్‌ను 10 నుంచి 15 ఏళ్ల టెన్యూర్‌తో తీసుకుంటారు. అయితే హోమ్ లోన్‌ను త్వరగా క్లోజ్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ హోమ్‌లోన్‌ను త్వరగా ఎలా క్లోజ్ చేయాలి.? ఇందుకోసం పాటించాల్సిన చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటా రూ. 1 లక్ష చెల్లించడం
మీరు హోమ్ లోన్ తీసుకున్న నాటి నుంచి ప్రతీ ఏటా ఒక లక్ష రూపాయలు కడుతూ వస్తే మీ లోన్ త్వరగా పూర్తవుతుంది. ఉదాహరణకు మీరు రూ. 30 లక్షల రుణాన్ని 8% వడ్డీ రేటుతో 15 సంవత్సరాలకు తీసుకుంటే మొత్తం రూ. 51 లక్షలు చెల్లించాలి.
అందులో రూ. 21 లక్షలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష అదనంగా చెల్లిస్తే, ఈ రుణాన్ని 7–8 సంవత్సరాల్లోనే ముగించవచ్చు. దీంతో రూ. 9 నుంచి రూ. 11 లక్షల వరకు వడ్డీ తగ్గిపోతుంది.
వెరియబుల్ వడ్డీకి ప్రీపేమెంట్ ఛార్జీలు ఉండవు
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో సాధారణంగా ప్రీపేమెంట్ ఛార్జీలు ఉండవు. కానీ ప్రైవేట్ బ్యాంకులు, ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో ఉంటే, 2% వరకు జరిమానా వసూలు చేసే అవకాశముంది. కొన్ని బ్యాంకులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అదనపు చెల్లింపులు అనుమతిస్తే, మరికొన్ని ఎప్పుడైనా చెల్లించేందుకు అవకాశం ఇస్తాయి.
EMI తగ్గించాలా? లేక టెన్యూర్ తగ్గించాలా?
మీరు అదనంగా చెల్లించిన తర్వాత రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి EMI తగ్గించడం, రెండోది EMI అదే ఉంచి, కాలాన్ని తగ్గించడం. వడ్డీని ఎక్కువగా తగ్గించుకోవాలంటే రెండో ఆప్షన్ (కాలం తగ్గించడం) ఉత్తమం. ఇందుకోసం బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది.
తక్కువ సమయంలో పూర్తి చేయడానికి టిప్స్
రుణం తీసుకున్న ప్రారంభ సంవత్సరాల్లోనే ఎక్కువగా వడ్డీ ఉంటుంది. అందుకే ఆ సమయంలోనే ఎక్కువ మొత్తాన్ని చెల్లించడం మంచిది. పన్ను రీఫండ్, బోనస్, ఇతర పొదుపుల నుంచి వచ్చే డబ్బులో కొంత భాగాన్ని ప్రతి సంవత్సరం ఉపయోగించండి. రుణం తీసుకునే ముందు, మధ్యలో అన్ని నిబంధనలు రాతపూర్వకంగా తెలుసుకోండి.
మొత్తం మీద గృహ రుణాన్ని ముందుగానే చెల్లిస్తే మీరు చాలా వడ్డీని తగ్గించుకోవచ్చు. ఇది ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం. క్రమంగా, ప్రతి సంవత్సరం రూ. 50,000 నుంచి రూ. 2 లక్షల మధ్య అదనంగా చెల్లించగలిగితే, మీరు 15 ఏళ్ల రుణాన్ని కేవలం 7–8 ఏళ్లలోనే పూర్తిచేయవచ్చు.