MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Loan: ఉన్న‌దాంతో సంతోషంగా ఉందాం.. మారుతోన్న యువ‌త తీరు, స‌ర్వేలో కీల‌క విష‌యాలు

Loan: ఉన్న‌దాంతో సంతోషంగా ఉందాం.. మారుతోన్న యువ‌త తీరు, స‌ర్వేలో కీల‌క విష‌యాలు

మంచి బైక్‌, కాస్లీ ఫోన్‌, స్టైలిష్ దుస్తులు.. ఇదీ యువ‌త ఆలోచించే విధానం. ఇందుకోసం అప్పులు చేయ‌డానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే ప్ర‌స్తుతం ఈ ఆలోచ‌న మారుతోంది. అప్పు చేసి ప‌ప్పు కూడు మాకొద్ద‌ని అంటున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 24 2025, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతోన్న యువ‌త ఆలోచ‌న తీరు
Image Credit : Gemini

మారుతోన్న యువ‌త ఆలోచ‌న తీరు

“అప్పు చేసి పప్పుకూడు తినొద్దు” అనే ప్రసిద్ధ సామెతను ఇప్పుడు నిజంగానే భారతీయ యువ‌త అనుసరిస్తోంది. మితిమీరిన ఖర్చులు, అవసరం లేని వస్తువుల కొనుగోలు తగ్గిపోగా, ఇప్పటికే ఉన్న డబ్బును మదుపు చేయ‌డంపై దృష్టిసారిస్తున్నారు.

త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రాలైతే మాత్రమే, ముఖ్యంగా స్థిరాస్తులు లేదా చరాస్తుల కోసం అప్పు తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ వినియోగ వస్తువుల కొరకు అప్పు తీసుకోవడం పెద్దగా ఆసక్తి చూపించ‌డం లేదు. అవ‌స‌రం లేక‌పోయినా అప్పులు తీసుకోని ఈఎమ్ఐలు చెల్లించే విధానానికి యువ‌త స్వ‌స్తి చెబుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప‌డిపోయిన రిటైల్ రుణ వృద్ధిరేటు
Image Credit : freepik

ప‌డిపోయిన రిటైల్ రుణ వృద్ధిరేటు

ట్రాన్స్‌యూనియన్ CIBIL నివేదిక ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారతదేశంలో రిటైల్ రుణాల వృద్ధిరేటు 12% వద్ద ఉండగా, అదే సంవత్సరంలో 2024-25 చివరి త్రైమాసికంలో అది గణనీయంగా 5 శాతానికి ప‌డిపోయింది. 

క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలు, క‌న్ఫ్యూమ‌ర్ డ్యూరబుల్ లాంటి విభాగాల్లో ఈ తగ్గుదల ఎక్కువ‌గా క‌నిపించింది. ఇది వినియోగదారులు పొదుపు వైపు మొగ్గు చూపిస్తున్నార‌న్న దానికి సంకేతంగా చెబుతున్నారు.

Related Articles

Related image1
Hyderabad: హైద‌రాబాద్‌లో రియ‌ల్ బూమ్‌.. గ‌జం ధ‌ర అక్ష‌రాల రూ. 2 ల‌క్ష‌లు, ఎక్క‌డంటే..
Related image2
Business Idea: చేతిలో రూ. 10 వేలు ఉంటే చాలు రూ. 60 వేలు సంపాదించ‌వ‌చ్చు.. బెస్ట్ సీజ‌న‌ల్ బిజినెస్ ఐడియాలు
35
త‌గ్గిన ప‌ర్స‌న‌ల్ లోన్‌, క్రెడిట్ కార్డ్ రుణాలు
Image Credit : Google

త‌గ్గిన ప‌ర్స‌న‌ల్ లోన్‌, క్రెడిట్ కార్డ్ రుణాలు

క్రెడిట్ కార్డు రుణాలు "జీరో నుంచి -32%" దాకా పడిపోయాయి. మరోవైపు, వ్యక్తిగత రుణాల వృద్ధివార్యం 13%- నుంచి 6% వద్దకు తగ్గింది. ఖ‌ర్చుల‌ను త‌గ్గించి పొదుపు వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు గ‌ణంకాలు చెబుతున్నాయి.

క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్ రుణాలు త‌గ్గాయి

టెలివిజన్, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాంటి వినియోగ వస్తువుల కొరకు తీసుకునే రుణాల సంఖ్య‌ 19% నుంచి 6%కి పడిపోయింది. నిరుద్యోగత, మార్కెట్ అనిశ్చితీ కూడా ఇందుకు కార‌ణంగా చెబుతున్నారు.

45
రుణ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య తగ్గుముఖం
Image Credit : Asianet News

రుణ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య తగ్గుముఖం

క్రెడిట్ యాక్టివ్ వినియోగదారులు 15% నుంచి 8%దాకా తగ్గారు. కొత్తగా రుణాలు తీసుకునే వారి వృద్ధిరేటు: 19 శాతం నుండి 16 శాతానికి తగ్గింది. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌కు క్రెడిట్ కార్డును ఉప‌యోగించే వారి సంఖ్య త‌గ్గిన‌ట్లు గ‌ణంకాలు చెబుతున్నాయి.

55
హోమ్ లోన్ మ‌రింత త‌గ్గుముఖం
Image Credit : Asianet News

హోమ్ లోన్ మ‌రింత త‌గ్గుముఖం

ఇప్పటి గణాంకాల ప్రకారం, గృహ రుణాల వృద్ధి 5% నుంచి -7%కి త‌గ్గింది. అయితే రూ. కోటిపైగా రుణాలు మాత్రం తొమ్మిది శాతం పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఇది సంపన్నులు, పెద్ద వ్యాపారాలు రుణాలు తీసుకోవడంలో పెరుగుదలను సూచిస్తుంది. కాగా గ్రామీణ రుణాలు 20 శాతం నుండి 22 శాతానికి పెరిగాయి.

సెమీ అర్బన్ ప్రాంత రుణాల వృద్ధి 29 శాతం నుండి 30 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలు భారతదేశంలో వినియోగదారుల రుణ ప్రవర్తనలో ఒక స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. యువతలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతున్నదని, అలాగే గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రుణ అవసరాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలియజేస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
పర్సనల్ పైనాన్స్
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అక్టోబ‌ర్ 1 నుంచి మ‌నీ విత్‌డ్రాపై ఛార్జీలు
Recommended image2
Gold Price Hike: ట్రంప్ నిర్ణయంతో దూసుకెళ్లిన పసిడి.. ఈ వరలక్ష్మీ వ్రతానికి బంగారం కష్టమే
Recommended image3
Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే
Related Stories
Recommended image1
Hyderabad: హైద‌రాబాద్‌లో రియ‌ల్ బూమ్‌.. గ‌జం ధ‌ర అక్ష‌రాల రూ. 2 ల‌క్ష‌లు, ఎక్క‌డంటే..
Recommended image2
Business Idea: చేతిలో రూ. 10 వేలు ఉంటే చాలు రూ. 60 వేలు సంపాదించ‌వ‌చ్చు.. బెస్ట్ సీజ‌న‌ల్ బిజినెస్ ఐడియాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved