నాలుగు నెలల క్రితం చోటుచేసుకున్న వ్యవహారంలో వైసిపి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఇంతకీ కేసు ఏంటో తెలుసా? 

YS Jaganmohan Reddy : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదయ్యింది. ఆయనతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసిపి నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, మోదుగులు వేణుగోపాల్ రెడ్డి పై నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. విచారణకు రావాలంటూ వీరికి నల్లపాడు పోలీసులు నోటీసులు జారీచేాశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 19న వైసిపి అధ్యక్షులు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులతో ఆయన మాట్లాడారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జగన్ ఇలా ప్రభుత్వ నిర్వహణలోని మిర్చి యార్డుకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా రెచ్చగొట్టేలా వ్యవహరించడం, రాజకీయ ప్రసంగాలు చేయడంతో జగన్ తో పాటు ఆయన వెంటున్న నాయకులపై కేసులు నమోదయ్యాయి.

అయితే ఇటీవలే పల్నాడు పర్యటనలో ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడని వైఎస్ జగన్ పై కేసు నమోదయ్యింది. జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందపడి సింగయ్య అనే వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వాహన డ్రైవర్ రమణా రెడ్డిని A1 గా, జగన్ ని A2గా పేర్కొంటూ బిఎన్ఎస్ 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, జగన్ పర్సనల్ సెక్రటరీ కె.నాగేశ్వర్ రెడ్డిపైనా కేసులు నమోదయ్యాయి.