తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
12:16 AM (IST) Jun 24
Iran Missile Attack on US Base: అణు స్థావరాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
11:44 PM (IST) Jun 23
Pawan Kalyan Slams YSRCP: కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర పునర్నిర్మాణానికి తొలి అడుగుగా నిలిచిందని తెలిపారు.
10:55 PM (IST) Jun 23
Telangana Cabinet : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం లభించింది.
10:52 PM (IST) Jun 23
12 దేశాల్లో వందకు పైగా పిల్లలున్న టెలిగ్రామ్ అధినేత పావెల్ డ్యూరోవ్, వాళ్లందరికీ తన 13 లక్షల కోట్ల ఆస్తిని పంచాలని నిర్ణయించుకున్నారు. ఆయను వంద మంది పిల్లలేంటి..వాళ్లకు ఆస్తిని పంచడమేంటి.. చదవండి మరి పూర్తి స్టోరీ
10:13 PM (IST) Jun 23
Rishabh Pant : హెడింగ్లీలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాధించిన తొలి భారత కీపర్ గా ఘనత సాధించాడు.
08:54 PM (IST) Jun 23
KL Rahul : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాల్గవ రోజు కేఎల్ రాహుల్ తన 9వ టెస్టు సెంచరీని సాధించాడు. ఈ క్రమంలోనే లెజెండరీ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ రికార్డులను బద్దలు కొట్టాడు.
08:10 PM (IST) Jun 23
KL Rahul: లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు. ఇది తనకు 9వ టెస్టు సెంచరీ.
07:11 PM (IST) Jun 23
israel iran conflict: ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ రక్షణ స్థావరాలపై ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడింది. టెహ్రాన్ సహా ఇరాన్ అణు కేంద్రాలు, డిఫెన్స్ బేస్ లపై దాడులు జరుగుతున్నాయి.
06:52 PM (IST) Jun 23
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం భారత బాస్మతి రైస్ ఎగుమతి మార్కెట్లో కొత్త సమస్యను తీసుకువచ్చింది. ఇరాన్ కి ఎగుమతి కావాల్సిన లక్ష టన్నుల బియ్యం భారత బందర్లలో నిలిచిపోయింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో బాస్మతి రైస్ ధర భారీగా పడిపోయింది.
05:49 PM (IST) Jun 23
israel iran conflict: ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. అయితే, తమ మిత్రదేశమైన ఇరాన్ కు రష్యా ఎందుకు సాయం చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
04:59 PM (IST) Jun 23
ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్పాహన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం అమెరికా బీ-2 స్పిరిట్ విమానాలను ఉపయోగించింది. దీంతో ప్రపంచమంతా ఇప్పుడు వీటి గురించే మాట్లాడుకుంటోంది.
04:11 PM (IST) Jun 23
BCCI: ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. 10 కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బెంగళూరు తొక్కిసలాట ఘటన బాధ్యులపై విచారణ, రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్నాయి.
03:35 PM (IST) Jun 23
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. హార్ముజ్ జల సంధిని మూసివేస్తారన్న వార్తల నేపథ్యంలో భారత్‌లో చమురు ధరలు పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి.
02:57 PM (IST) Jun 23
Prakash Shah: ప్రకాష్ షా పేరు ప్రస్తుతం చాలా ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే? కోట్లల్లో జీతం.. విలాసవంతమైన జీవితం.. భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్తతో సాన్నిహిత్యం.. ఇవన్నీ వదులుకొని జైన దీక్ష స్వీకరించారు ప్రకాష్ షా. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.
12:33 PM (IST) Jun 23
సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనిషి ఎంతలా దిగజారుతున్నాడో అర్థమవుతోంది. నైతిక విలువలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ మరిచిపోకముందే తాజాగా తెలంగాణలోనూ చోటు చేసుకుంది.
12:00 PM (IST) Jun 23
టెహ్రాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా శక్తివంతమైన బాంబులు, క్షిపణులతో హఠాత్ దాడులకు దిగింది. ఈ చర్యకు ట్రంప్ స్వయంగా చివరి నిమిషంలో ఆమోదం తెలిపినట్లు సమాచారం.
11:26 AM (IST) Jun 23
ఆపరేషన్ సిందూర్‌తో భారత దేశ ఆర్మీ సత్తా ఏంటో పాకిస్థాన్‌తో పాటు ప్రపంచానికి తెలిసింది. భారత వద్ద ఉన్న అధునాతన వెపన్స్ ప్రపంచానికి పరిచయమయ్యాయి. కాగా తాజాగా ఇండియన్ ఆర్మీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
10:47 AM (IST) Jun 23
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులు క్రమంగా ప్రపంచంపై ప్రభావం చూపుతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
10:30 AM (IST) Jun 23
2021లో శ్రీశైలంలో లభ్యమైన రాగి శాసనాల్లో తోకచుక్కలు, ఉల్కాపాతాలపై పురాతన కాలం నుంచే ఉన్న ఖగోళ పరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది.
09:58 AM (IST) Jun 23
అమరావతిలో కొత్తగా వెయ్యి పడకల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. అతి త్వరలోనే దానికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.
09:23 AM (IST) Jun 23
భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొంగొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న టీటీడీ తాజాగా మరో విప్లవాత్మక దిశగా అడుగు వేసింది. ఇకపై లడ్డూ టికెట్ల కోసం క్యూ లైన్స్‌లో నిల్చోవాల్సిన పనిలేకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.
07:52 AM (IST) Jun 23
రుతుపవనాల ఎంట్రీ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముందుగానే రుతుపవనాలు వచ్చినా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే ఇలాంటి తరుణంలో మారిన వాతావరణం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది.
07:27 AM (IST) Jun 23
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య మొదలైన ఉద్రిక్తతలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.