MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Rishabh Pant: రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్

Rishabh Pant: రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్

Rishabh Pant : హెడింగ్లీలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాధించిన తొలి భారత కీపర్ గా ఘనత సాధించాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 23 2025, 10:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
హెడింగ్లీలో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
Image Credit : X/BCCI

హెడింగ్లీలో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్

భారత కీపర్‌గా రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు సాధించాడు. లీడ్స్ లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్ తో భారత్ మొదటి టెస్టు ఆడుతోంది. ఈ మ్యాచ్ లో భారత ఆటగాడు రిషబ్ పంత్ చారిత్రాత్మక ఘనత సాధించాడు. 

టెస్టు వైస్-కెప్టెన్‌గా ఉన్న పంత్.. నాల్గవ రోజు తన బ్యాటింగ్ ప్రతిభను మరోసారి చాటుతూ, రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
రెండు ఇన్నింగ్స్‌లలో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న రిషబ్ పంత్
Image Credit : Getty

రెండు ఇన్నింగ్స్‌లలో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న రిషబ్ పంత్

రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 134 పరుగులు సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నాక్ లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఇదే మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 118 పరుగుల సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో పంత్ 15 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జోష్ టంగ్ పంత్ వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతనిని షోయబ్ బషీర్ అవుట్ చేశాడు.

📸 📸

What an entertainer! What a performer! 🫡 🫡

Rishabh Pant - Take. A. Bow 🙌

Updates ▶️ https://t.co/CuzAEnBkyu #TeamIndia | #ENGvIND | @RishabhPant17 pic.twitter.com/I7e87xjLG6

— BCCI (@BCCI) June 23, 2025

37
ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు ఎవరు?
Image Credit : X/BCCI

ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు ఎవరు?

రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలతో అరుదైన ఫీట్ సాధించిన ఏడవ భారత ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ లిస్టులో విజయ్ హజారే, సునీల్ గవాస్కర్ (మూడు సార్లు), రాహుల్ ద్రావిడ్ (రెండు సార్లు), విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రోహిత్ శర్మలు ఉన్నారు.

ఇంగ్లాండ్ లో ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, అతను టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్. పంత్ ముందు ఈ ఘనత జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఆండీ ఫ్లవర్ 2001లో సాధించాడు.

47
సచిన్, దిలీప్ వెంగ్‌సర్కార్ సరసన చేరిన రిషబ్ పంత్
Image Credit : X/BCCI

సచిన్, దిలీప్ వెంగ్‌సర్కార్ సరసన చేరిన రిషబ్ పంత్

ఇంగ్లాండ్ గడ్డపై నాలుగు టెస్టు సెంచరీలతో రిషభ్ పంత్.. సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ సరసన నిలిచాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రావిడ్ 6 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. పంత్ ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన ఆరు అర్ధ సెంచరీలలో నాలింటిని సెంచరీలుగా మార్చడంలోను ప్రత్యేకంగా నిలిచాడు.

He's steely, He's Bold 💥

When Rishabh Pant bats, the records are never on hold 😎

Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @RishabhPant17 pic.twitter.com/UuNea6WmiS

— BCCI (@BCCI) June 23, 2025

57
రిషబ్ పంత్ - కేఎల్ రాహుల్ భాగస్వామ్యం
Image Credit : X/BCCI

రిషబ్ పంత్ - కేఎల్ రాహుల్ భాగస్వామ్యం

మ్యాచ్ నాల్గవ రోజు ఉదయం కెప్టెన్ శుభ్ మన్ గిల్ వికెట్ ను భారత్ త్వరగానే కోల్పోయింది. గిల్ ఔట్ అయిన తర్వాత పంత్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి భారత్ స్కోరు 92/3 పరుగులుగా ఉంది. కేఎల్ రాహుల్‌తో కలిసి అతను మెల్లగా ఆటను ముందుకు నడిపించాడు. 

లంచ్ తర్వాత పంత్ మెరుపులు మెరిపించాడు. స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను టార్గెట్ చేసి పరుగులు రాబట్టాడు. 130 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ అదరగొట్టాడు. అయితే తర్వాత బషీర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి సెంచరీలతో భారత్ 300+ పరుగులు మార్కును దాటింది.

67
వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ రికార్డులు
Image Credit : X/BCCI

వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ రికార్డులు

రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సులతో ఆకట్టుకున్నాడు. ఇది ఇంగ్లాండ్ టెస్టు మ్యాచులో ఓ విదేశీ బ్యాటర్ చేసిన అత్యధిక సిక్సులు. గతంతో సామ్ లోక్స్టన్ (1948), మైకేల్ హోల్డింగ్ (1984), అడమ్ గిల్‌క్రిస్టు (2001) ఐదేసి సిక్సర్లలో ఉన్నారు. ఇప్పుడు పంత్ వారి రికార్డులు బ్రేక్ చేశాడు.

ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో భారత వికెట్ కీపర్లలో పంత్ అత్యధిక సెంచరీలు సాధించాడు. మొత్తం 8 సెంచరీలు కొట్టాడు. ఎంఎస్ ధోని (6 సెంచరీలు) రికార్డును దాటేశాడు. టెస్టు క్రికెట్‌లో 44 మ్యాచ్‌లలో పంత్ 3,200 పరుగులు సాధించగా, సగటు 44.44గా ఉంది. ఇంగ్లాండ్ పై పంత్ 1,033 పరుగులు చేశాడు.

77
పంత్ పై గవాస్కర్ ప్రశంసలు
Image Credit : X/BCCI

పంత్ పై గవాస్కర్ ప్రశంసలు

రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన అనంతరం కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ అతని చలాకీ ఆటపై ఆనందం వ్యక్తం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ తర్వాత చేసిన ఫ్రంట్ ఫ్లిప్‌ను మళ్లీ చేయాలని సంకేతాలిచ్చారు. కానీ పంత్ మాత్రం "ఫింగర్ ఐ" సెలబ్రేషన్ చేసి ప్రేక్షకులను అలరించాడు. పంత్ 118 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 137 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

1⃣3⃣7⃣ runs
2⃣4⃣7⃣ deliveries
1⃣8⃣ fours

Quality, patience, and an innings full of class from KL Rahul in Headingley 👏👏

Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @klrahul pic.twitter.com/LgZF0N2vLw

— BCCI (@BCCI) June 23, 2025

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
KL Rahul: లీడ్స్ లో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్
Recommended image2
KL Rahul: గవాస్కర్, ద్రావిడ్ రికార్డులు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved