Iran Missile Attack on US Base: అణు స్థావరాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
Iran Missile Attack on US Base: మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ తరఫున అమెరికా కూడా ఇరాన్ పై దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికా ఆర్మీ బెస్ లను టార్గెట్ చేసి దాడులు చేసింది.
తాజాగా ఇరాన్ మీడియా ఈ వివరాలు వెల్లడించింది. మంగళవారం (జూన్ 23, 2025) రాత్రి ఇరాన్ ఖతార్ లోని అల్ ఉడైద్ ఎయిర్ బేస్, అమెరికన్ సైనిక స్థావరాల్లో అతిపెద్దదైన ఈ స్థావరాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాడి చేసింది. అనేక రాకెట్లతో దాడి చేసింది. ఈ దాడి అమెరికా ఇటీవల ఇరాన్ అణు పరిశోధనా కేంద్రాలపై నిర్వహించిన గగనతల దాడులకు ప్రతీకారం అంటూ ఇరాన్ పేర్కొంది.
ఖతార్ ఆకాశ మార్గం మూసివేత
ఇరాన్ మిస్సైళ్ళు సంధించిన వెంటనే, ఖతార్ ప్రభుత్వం తన ఆకాశ మార్గాలను సురక్షిత కారణాలతో మూసివేసింది. దోహా, లూసైల్ ప్రాంతాల్లో దృశ్యాల ప్రకారం, భారీ స్ఫోటనలు జరిగాయి. రాత్రి ఆకాశంలో మిస్సైళ్లూ గాలిలో ఎగిరిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి.
ఇరాన్ టీవీ ప్రత్యక్ష ప్రసారంలో మిస్సైల్ దాడి ప్రకటన
ఇరాన్ దేశ టెలివిజన్ ఈ దాడి ఫుటేజీని ప్రసారం చేస్తూ, “అమెరికా శత్రుత్వానికి ఇరాన్ సైన్యాల శక్తివంతమైన, విజయవంతమైన జవాబు” అని పేర్కొంది. రాయిటర్స్ సమాచారం ప్రకారం, ఇరాన్ సైన్యం అల్ ఉడైద్ పై మిస్సైల్ దాడి తీవ్రమైన విధ్వంసంగా పేర్కొంది.
అమెరికా దాడికి సమంగా ఇరాన్ ప్రతిస్పందన
ఇరాన్ అత్యున్నత భద్రతా మండలి ఒక ప్రకటన ద్వారా, అమెరికా తన అణు సైట్లపై చేసిన దాడిలో వాడిన బాంబుల సంఖ్యకు సమానంగా తమ సైన్యాలు దాడి చేశాయని తెలిపింది. దాడి చేసిన స్థావరం నగర ప్రాంతాలకు దూరంగా ఉన్న ఖతార్ భూభాగంలోని సైనిక స్థావరం అనీ, ఖతార్ ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదు అని స్పష్టం చేసింది.
బహ్రెయిన్, అమెరికా ఎంబసీల అప్రమత్తత
అమెరికా నౌకాదళం ఐదవ ఫ్లీట్ ఉన్న బహ్రెయిన్ ప్రజలు శాంతంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పిలుపునిచ్చింది. దోహా, ఇతర పశ్చిమ దేశాల ఎంబసీలు ప్రజలను ఆపద సమయం వరకు తమ స్థలంలోనే ఉండాలని సూచనలు ఇవ్వడం జరిగింది.
ఖతార్ స్పందన ఇదే
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని గుర్తించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తమకు ప్రత్యక్ష ప్రతిస్పందన హక్కు ఉన్నదని స్పష్టం చేసింది. కానీ, భద్రత పరిస్థితులు సురక్షితంగా ఉన్నాయని, ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ప్రజలకు హామీ ఇచ్చింది.
ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తోంది
ఇజ్రాయెల్ సైన్యం IDF ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని మిస్సైల్, డ్రోన్ నిల్వ కేంద్రాలపై సుమారు 15 ఫైటర్ జెట్లతో దాడులు చేశాయని అధికారిక ప్రకటనలో తెలిపింది. దీనిలో డిఫెన్స్ ప్రాంతాలు, ఆయుధ నిల్వ ప్రాంతాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు, ఇరాన్ మిస్సైల్ దాడులపై అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ లేదా సెంట్రల్ కమాండ్ అధికారిక స్పందన లేదు. దాడులలో ఎలాంటి నష్టాలు లేదా ప్రాణనష్టం గురించి వివరాలు పేర్కొనలేదు. ఈ మధ్యప్రాచ్య దాడులు, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
