ఆపరేషన్ సిందూర్‌తో భారత దేశ ఆర్మీ సత్తా ఏంటో పాకిస్థాన్‌తో పాటు ప్రపంచానికి తెలిసింది. భారత వద్ద ఉన్న అధునాతన వెపన్స్ ప్రపంచానికి పరిచయమయ్యాయి. కాగా తాజాగా ఇండియన్ ఆర్మీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
భారత సైన్యం దేశ రక్షణలో కీలకమైన అస్త్రంగా మారిన పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ (MBRL) వ్యవస్థను మరింత బలోపేతం చేయబోతోంది. ఇప్పటికే 2 రేజిమెంట్లు సేవలో ఉన్నాయి. మరో 2 రేజిమెంట్లకు సంబంధించిన పరికరాలు అందగా, శిక్షణ ప్రారంభం కానుంది. మిగిలిన 2 రేజిమెంట్లు 2026 ప్రారంభానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
2026 నాటికి మొత్తం 6 రేజిమెంట్లు సిద్ధం
భారత ప్రభుత్వం 2020లో పినాకా లాంచర్‌ల కోసం రూ.2580 కోట్ల విలువైన ఒప్పందాన్ని BEML, టాటా పవర్, L&T సంస్థలతో చేసింది. అప్పటికే 2 రేజిమెంట్లు పనిచేస్తున్నాయి. మరో రెండు రేజిమెంట్లకు పరికరాలు అందాయి. 2026 నాటికి మిగతా రెండింటిని కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గల్వాన్ ఘటనా తర్వాత తీసుకున్న కీలక నిర్ణయం
చైనా-భారత్ సరిహద్దుల్లో 2020 జూన్‌లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వ్యవస్థను వేగంగా అమలు చేయాలనే దిశగా ముందుకెళ్లింది. అప్పటి నుంచి సరిహద్దు రక్షణ కోసం తక్షణ చర్యలతో పాటు, దీర్ఘకాలిక వ్యూహాలతో ఈ రాకెట్ లాంచర్ వ్యవస్థను దశల వారిగా ఏర్పాటు చేస్తున్నారు.
పినాకా లాంచర్ వ్యవస్థ విశేషాలు
పినాకా రాకెట్ లాంచర్ ఒక రేజిమెంట్‌లో మూడు బ్యాటరీలు ఉంటాయి. ఒక్కో బ్యాటరీలో 6 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్ 44 సెకన్లలో 12 రాకెట్లను 38 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించగలదు. దీని ప్రభావంతో 1 కి.మీ x 800 మీటర్ల విస్తీర్ణంలో శత్రువుల స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయవచ్చు. పినాకా ఎక్స్‌టెండెడ్ రేంజ్ (ER) వేరియంట్ 75 కిలోమీటర్ల వరకు శత్రువులను లక్ష్యంగా చేసుకోవచ్చు.
పాత సోవియట్ గ్రాడ్ సిస్టమ్‌ను స్థానంలోకి పినాకా
ప్రస్తుతం భారత సైన్యం రష్యా గ్రాడ్ BM-21 రాకెట్ లాంచర్ 5 రేజిమెంట్లు, స్మెర్చ్ రాకెట్ వ్యవస్థ 3 రేజిమెంట్లను వాడుతోంది. ఇవి పాత తరానికి చెందినవిగా మారిపోవడంతో, వాటి స్థానంలో పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా వ్యవస్థను ప్రవేశపెడుతోంది. పినాకాలో ఆటోమేటెడ్ గన్ అమింగ్, పొజిషనింగ్, కమాండ్ పోస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి.
రక్షణ రంగంలో స్థానికత, సామర్థ్యం పెరుగుతోంది
డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన పినాకా వ్యవస్థను ఇప్పటికే అనేక మార్గాల్లో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఎక్కువ రేంజ్, వేగంగా దాడి చేసే సామర్థ్యం ఉన్న పినాకా రాకెట్లు భారత్ రక్షణ రంగంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ విజయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఈ క్రమంలోనే 2023లో రూ.2800 కోట్ల విలువైన 6400 రాకెట్ల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2025 నాటికి రూ.10147 కోట్ల విలువైన 45 కి.మీ స్ట్రైక్ రేంజ్ గల హై ఎక్స్‌ప్లోసివ్ రాకెట్లు, 37 కి.మీ దూరానికి ప్రయోగించగల రాకెట్ల కొనుగోలుకు ఒప్పందాలు కుదిరాయి.
