KL Rahul: గవాస్కర్, ద్రావిడ్ రికార్డులు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
KL Rahul : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాల్గవ రోజు కేఎల్ రాహుల్ తన 9వ టెస్టు సెంచరీని సాధించాడు. ఈ క్రమంలోనే లెజెండరీ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ రికార్డులను బద్దలు కొట్టాడు.

ఇంగ్లాండ్ లో మూడో సెంచరీతో కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్‌లో మరొక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ తో తొలి టెస్టును ఆడుతోంది. లీడ్స్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ కొట్టాడు. దీంతో ఆసియా ఓపెనర్లలో ఇంగ్లాండ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. రాహుల్ తన సెంచరీని 202 బంతుల్లో 13 బౌండరీలతో పూర్తి చేశాడు.
💯 𝙛𝙤𝙧 𝙆𝙇 𝙍𝙖𝙝𝙪𝙡! 👏 👏
His 9⃣th TON in Test cricket 🙌 🙌
What a wonderful knock this has been! 👌 👌
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @klrahulpic.twitter.com/XBr9RiheBR— BCCI (@BCCI) June 23, 2025
సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్‌ల రికార్డులు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ కు ఈ సెంచరీ ఇంగ్లాండ్ గడ్డపై ఓపెనర్‌గా మూడవది. ఈ క్రమంలోనే దిగ్గజ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ లో సునీల్ గవాస్కర్ 2, రాహుల్ ద్రావిడ్ 2, విజయ్ మెర్చంట్ 2, రవి శాస్త్రి 2, తమీమ్ ఇక్బాల్ 2 సెంచరీల రికార్డును అధిగమించాడు. టెస్ట్ చరిత్రలో ఇంగ్లాండ్ లో మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆసియా ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.
Tea Break on Day 4 at Headingley!
Superb hundreds from KL Rahul (120*) & Rishabh Pant (118) power #TeamIndia to 298/4! 💪 💪
Third Session coming 🔜!
Updates ▶️ https://t.co/CuzAEnAMIW#ENGvIND | @klrahul | @RishabhPant17pic.twitter.com/oHo27TlNHe— BCCI (@BCCI) June 23, 2025
రిషబ్ పంత్ తో కలిసి కేఎల్ రాహుల్ సూపర్ నాక్
ఈ మ్యాచ్ నాల్గవ రోజు (జూన్ 23న) భారత జట్టు తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ వికెట్ ను త్వరగా కోల్పోయింది. అప్పటికి భారత స్కోరు 92/3 పరుగులుగా ఉంది. కానీ కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చి కుదురుకుని మంచి నాక్ ఆడాడు.
సెంచరీతో మెరిశాడు. అతని తోడుగా వచ్చిన రిషబ్ పంత్‌తో కలిసి మ్యాచ్‌కు మలుపు తిప్పే భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే పంత్ మెరుపు సెంచరీ కొట్టాడు. 118 పరుగలు తన సెంచరీ ఇన్నింగ్స్ లో పంత్ 15 ఫోర్లు, 3 సెంచరీలు కొట్టాడు.
📸 📸
What an entertainer! What a performer! 🫡 🫡
Rishabh Pant - Take. A. Bow 🙌
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @RishabhPant17pic.twitter.com/I7e87xjLG6— BCCI (@BCCI) June 23, 2025
8⃣𝘁𝗵 𝗧𝗲𝘀𝘁 💯 𝗳𝗼𝗿 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 𝗣𝗮𝗻𝘁! 🙌
1⃣st Indian to score hundreds in both innings of a Test in England 🔝
7⃣th Indian to score hundreds in both innings of a Test! 👏
Incredible batting display in the series opener from the #TeamIndia vice-captain! 👍 👍… pic.twitter.com/RzNA9lfFQr— BCCI (@BCCI) June 23, 2025
లీడ్స్ లోని హెడ్డింగ్లీ పిచ్‌పై కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్
లీడ్స్ లోని హెడ్డింగ్లీ పిచ్ పై మేఘావృత వాతావరణంలో కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్ క్లాస్ చూపించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. సెంచరీతో రాహుల్ తన ఆట సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పాడు.
కేఎల్ రాహుల్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో తొమ్మిది సెంచరీలు చేశాడు. ఇందులో ఇంగ్లాండ్ పై నాలుగు సెంచరీలు ఉన్నాయి. 2018లో ది ఓవల్ లో 149 పరుగులు, 2021లో లార్డ్స్‌లో 129 పరుగులు, తాజా సెంచరీ 2025లో హెడ్డింగ్లీ వేదికగా వచ్చాయి. దీంతో రాహుల్‌కి ఇంగ్లాండ్ గడ్డపై మూడు సెంచరీలు కాగా, ఓపెనర్‌గానే వచ్చాయి. ఇది ఇండియా క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.
కేఎల్ రాహుల్‌కు లభించిన లక్కీ బ్రేక్
ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో రాహుల్ 58 పరుగులు వద్ద ఉన్న సమయంలో హ్యారీ బ్రుక్ అతని క్యాచ్‌ను వదిలాడు. జోష్ టంగ్ వేసిన షార్ట్ బాల్‌ను థర్డ్ మ్యాన్ వైపు గైడ్ చేసిన రాహుల్‌కు, బ్రుక్ క్యాచ్ డ్రాప్ చేయడంతో మరో అవకాశం లభించింది. అదే అవకాశాన్ని ఉపయోగించుకుని సెంచరీ చేశాడు.
సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సెనా) దేశాల్లో టెస్ట్ ఓపెనర్‌గా 50+ స్కోర్లు ఎక్కువ చేయడంలో రాహుల్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నాడు. ఆయనతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్ కూడా ఉన్నారు. వీరి కంటే ముందు టాప్ లో సునీల్ గవాస్కర్ ఉన్నారు.
కేఎల్ రాహుల్ టెస్ట్ కెరీర్ గణాంకాలు గమనిస్తే.. ఇప్పటివరకు 59 టెస్టులు ఆడి, 3,350కి పైగా పరుగులు సాధించాడు. టెస్టుల్లో రాహుల్ 9 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు, సునీల్ గవాస్కర్ "కేఎల్ రాహుల్ ఒక పూర్తి జట్టు వ్యక్తి" అని వ్యాఖ్యానించాడు. సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "తన సామర్థ్యం రాహుల్‌కి కూడా అర్థం కాలేకపోవచ్చు. ఈ సిరీస్ అతని ప్రస్థానంలో మైలురాయిగా నిలవొచ్చు" అని అన్నారు. అందుకు దగ్గట్టుగానే కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటతో రాణిస్తున్నాడు.