israel iran conflict: ఇరాన్ ఇజ్రాయెల్‌ యుద్ధం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. అయితే, తమ మిత్రదేశమైన ఇరాన్ కు రష్యా ఎందుకు సాయం చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

israel iran conflict: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరిట ఇరాన్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా నిలిచింది. టెహ్రాన్‌ సహా ఇరాన్ అణు కేంద్రాలుగా నగరాలను టార్గెట్ చేస్తూ మెరుపుదాడులు కూడా చేసింది. ఈ క్రమంలోనే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ పరిణామాల మధ్య, ఇరాన్‌కు అనేక దశాబ్దాలుగా మిత్ర దేశంగా కొనసాగుతున్న రష్యా ఇప్పటివరకు సహాయం చేయకపోవడంతో చాలా ఆశ్చర్యంతో పాటు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. రష్యా దౌత్య నీతిని ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. తాము నేరుగా ఇరాన్ తరఫున ఎందుకు యుద్ధంలోకి అడుగు పెట్టలేదనే విషయాలు వెల్లడించారు.

ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంపై పుతిన్ ఏం చెప్పారంటే?

సోమవారం (జూన్ 23, 2025) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటర్వ్యూలో “రష్యా ఇరాన్‌కు సహాయం చేయడంపై ఎందుకు నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారనే” ప్రశ్నకు పలు విషయాలు ప్రస్తావిస్తూ వివరంగా సమాధానమిచ్చారు. రష్యాతో ఇరు దేశాల చారిత్రక నేపథ్యం, విషయాలు పరిగణలోకి తీసుకుని తాము నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టలేదన్నారు. ఇజ్రాయెల్ లో సుమారు రెండు మిలియన్ల మంది రష్యన్ స్పీకింగ్ ప్రజలు ఉన్నారని తెలిపారు. ఈ గణాంకం ఆధారంగా, రష్యా తాజా నిర్ణయం తీసుకుందని తెలిపారు.

స్టార్. పీటర్స్బర్గ్ ఆర్థిక సదస్సులో పుతిన్ వ్యాఖ్యలు

స్టార్. పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరమ్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. “దయచేసి నా దృష్టి కోణాన్ని అర్థం చేసుకోండి.. అదే విధంగా చూడండి. ఒకప్పటి సోవియట్ యూనియన్, రష్యా ఫెడరేషన్‌లో నివసించిన సుమారు రెండు మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లో ఉన్నారు. ఇది ఇప్పుడు సుమారు రష్యన్ స్పీకింగ్ దేశంలా ఉంది. అందువల్ల, ఇది మోడ్రన్ రష్యా చరిత్రలో ఎల్లప్పుడూ మన దృష్టిలో ఉంటుంది. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేరుగా అడుగుపెట్టలేదు. తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాము” అని పుతిన్ తెలిపారు.

Scroll to load tweet…

ప్రోవోకేటర్లు అంటూ పుతిన్ ఫైర్

రష్యాపై విమర్శలు, ఇరాన్ తో సంబంధాలు, దౌత్యంపై ప్రశ్నలు వేస్తున్న సందర్భంలో పుతిన్ వారిని “ప్రోవోకేటర్లు” (provocateurs) అని తప్పుబట్టారు. అలాగే, రష్యా అరబ్ దేశాలు, ఇతర ఇస్లామిక్ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నదని స్పష్టం చేశారు.

రష్యా మొత్తం జనాభాలో సుమారు 15% మంది ముస్లింలు ఉన్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, రష్యా OIC (Organization of Islamic Cooperation)లో పర్యవేక్షకస్థానం కలిగి ఉందని పుతిన్ తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయంతో ఇతర దేశాలతో మా సంబంధాలపై ప్రశ్నలు అనవసరమంటూ కామెంట్స్ చేశారు.

అమెరికా దాడుల నేపథ్యంలో మధ్యవర్తిత్వ ప్రతిపాదన చేసిన రష్యా

జూన్ 21న అమెరికా “ఆపరేషన్ మిడ్‌‌నైట్ హ్యామ్‍మెర్” పేరుతో ఇరాన్ లో కీలక అణు పరిశోధన కేంద్రాలైన ఫార్డౌ (Fordow), నాటాన్జ్ (Natanz), ఇస్ఫహాన్ (Isfahan) పై భారీ ‘బంకర్ బస్టర్’ బాంబులు విసిరింది. విజయవంతంగా తమ ఆర్మీ దాడులను పూర్తి చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. “స్పెక్టాక్యులర్ మిలిటరీ విజయం” అంటూ ఆర్మీపై ప్రశంసలు కురిపించారు. పుతిన్ ఈ పరిణామాలపై మాట్లాడుతూ.. అమెరికా దాడులు అంతర్జాతీయ న్యాయ నిబంధలను ఉల్లంఘించేవి” అని పేర్కొన్నారు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. “మీరు ముందు మీ దేశ శాంతి వ్యవహారాలను చూసుకోండి. మీరు మీ సమస్యలను దూరం చేసుకోవడానికి ముందు మధ్యవర్త్య చర్యలు తీసుకోండి” అంటూ ఉక్రెయిన్ తో కొనసాగుతున్న ఘర్షణలను ట్రంప్ ప్రస్తావించారు.

Scroll to load tweet…

రష్యా క్రేమ్లిన్ కార్యదర్శి డిమిత్రీ పేస్కోవ్ మాట్లాడుతూ ఇరాన్ మంత్రివర్గానికి రష్యా మద్యవర్తిత్వ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే దీనికి అనుసంధానంగా, ఈ అవకాశాన్ని ఇరాన్ యథావిధిగా అవసరం అనుకుంటేనే అంగీకరిస్తామని వెల్లడించింది.

ఇజ్రాయెల్ పై రాకెట్లతో విరుచుకుపడుతున్న ఇరాన్

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ భారీ రాకెట్లతో దాడులు చేస్తోంది. అమెరికాను కూడా హెచ్చరించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ అధికారి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. “ఈ దాడులు పూర్తిగా సమస్యను పరిష్కరించదు. అమెరికా నుంచి లేదా ఇజ్రాయెల్ నుంచి జరుగుతున్న ఈ దాడులు శాంతి చర్చలకు మార్గం కాదు. మేము ప్రతిఫలంగా చర్య తీసుకున్న తర్వాత శాంతి ప్రక్రియలను పునఃప్రారంభిస్తాము. మాపై దాడులు చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం” అని అన్నారు.

ఇరాన్ కు అణ్వాయుధాలు అందించేందుకు సిద్ధంగా పలుదేశాలు.. దిమిత్రి మెద్వదేవ్ ఆందోళన

ఇజ్రాయెల్ తరఫున ఇరాన్ పై అమెరికా దాడులు చేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ (Dimitri Medvedev) అన్నారు.

కొన్ని దేశాలు నేరుగా ఇరాన్‌కు తమ స్వంత అణు ఆయుధాలను అందంచేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. అయితే, ఆ దేశాలు ఏవో పేర్లను వెల్లడించలేదు. అంతేకాకుండా, ఈ దాడులు ఇరాన్ రాజకీయ వ్యవస్థను బలపరిచాయనీ, ప్రజలు తమ మత నేతృత్వం చుట్టూ ముఖ్యంగా సమ్మిళితంగా నిలబడ్డారంటూ వెల్లడించారు.

OIC సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఇస్తాంబుల్‌లో నిర్వహించిన OIC సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. “రష్యా ఒక మిత్రదేశం. మేము ఎల్లప్పుడూ సలహాలు, సంబంధాలు మార్చుకుంటాము. నేను సోమవారం మాస్కో వెళ్తున్నాను. వారితో ప్రస్తుత విషయాలపై చర్చలు జరుపుతాము" అని పేర్కొన్నారు.

తాజాగా ఈ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. రష్యా, ఇజ్రాయెల్ దాడులు దుందుడుకు చర్యలుగా పేర్కొన్నారు. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లోకి రష్యా ఎంట్రీ ఇస్తే పరిస్థితి మరో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Scroll to load tweet…