తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:57 PM (IST) Jul 08
RCB: విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన తర్వాత అత్యధిక బ్రాండ్ విలువను సాధించింది. ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను అధిగమించి తొలి స్థానంలోకి చేరింది.
11:38 PM (IST) Jul 08
PM Modi: బ్రెజిల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి 114 గుర్రాల సైనిక గౌరవంతో ఘనస్వాగతం లభించింది. అలాగే, బ్రెజిల్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్' తో సత్కరించింది.
11:06 PM (IST) Jul 08
Wiaan Mulder: వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా రికార్డుకు 33 పరుగులు దూరంలో ఉన్న సమయంలో వియన్ ముల్డర్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?
10:12 PM (IST) Jul 08
India vs England: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది. రెండు టెస్టులు పూర్తికాగా, మూడో టెస్ట్ జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. హోరాహోరీ అంచనాలున్న ఈ మ్యచ్ ను ఎక్కడ ఫ్రీగా లైవ్ చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
09:54 PM (IST) Jul 08
జులై 9 అంటే రేపు బుధవారం కాార్మిక సంఘాల భారత్ బంద్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించాయి కొన్ని మేనేజ్మెంట్స్. మీకు సెలవు మెసేజ్ వచ్చిందా?
09:27 PM (IST) Jul 08
Lords pitch: హోమ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు పొందిన లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత్ ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టును ఆడనున్నాయి. ఇక్కడి పిచ్ ఎలా ఉండనుంది? గత రికార్డులు ఎలా ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
08:56 PM (IST) Jul 08
టాలీవుడ్ లో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. తెలుగువారి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే వారిలో కొంత మంది చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నితిన్ నటించిన దిల్ సినిమాలో నటించిన 5 స్టార్ నటులు ఇప్పుడు ఈ లోకంలో లేరు ఇంతకీ వారు ?
08:50 PM (IST) Jul 08
India vs England: లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టుకు సై అంటున్నాయి. అయితే, ఈ గ్రౌండ్ లో భారత బౌలింగ్ రికార్డులు గమనిస్తే.. పలువురు బౌలర్లు ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:24 PM (IST) Jul 08
Indian cricketers Bollywood love stories: పలువురు భారత క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమల వల్ల తమ ఆటపై పట్టును కోల్పోయారని తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. వారిలో విరాట్ కోహ్లీ, యూవరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు.
06:50 PM (IST) Jul 08
ఎలాన్ మస్క్ స్కూల్ అస్ట్రా నోవా స్కూల్లో పిల్లలకి బట్టీ పట్టించడం ఉండదు... ఆలోచించడం ఎలాగో నేర్పుతారు. బ్యాగులు, హోంవర్క్, రిపోర్ట్ కార్డులు లేని ఈ స్కూల్ చాలా ప్రత్యేకం. మరీ ఈ స్కూల్ ఫీజు ఎంతో తెలుసా?
06:01 PM (IST) Jul 08
Sourav Ganguly - Nagma relationship: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో తన సంబంధం ఎందుకు ముగిసిందో నటి నగ్మా ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
05:10 PM (IST) Jul 08
మనలో చాలామంది మధ్యతరగతి జీవితం గడుపుతున్నవారే. నిజానికి మధ్యతరగతి జీవితం అంత ఈజీ కాదు. అన్నింటికి సర్దుకుపోవాల్సి ఉంటుంది. అయితే జీవితంలో త్వరగా ఎదగాలన్నా, కోట్లల్లో డబ్బు సంపాదించాలన్నా కొన్ని విషయాలపై శ్రద్ధ అవసరం. అవేంటో చూద్దాం.
04:57 PM (IST) Jul 08
వరి పుట్టుక, పరిణామం, మానవ సమాజంపై దాని ప్రభావం గురించి ఓ శాస్త్రవేత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. ఆసియా వరి పుట్టుక, కొత్త రకాలు ఎలా పుట్టుకొచ్చాయి, వరి సమాజంలో తెచ్చిన మార్పుల గురించి సదరు శాస్త్రవేత్త ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
04:39 PM (IST) Jul 08
ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు మన విశ్వం. జంతువులు, ప్రాంతాలు ఇలా ఎన్నో వింతలు ఉన్నాయి. అలాంటి ఒక వింత గురించి ఈరోజు తెలుసుకుందాం.
03:56 PM (IST) Jul 08
ఆపరేషన్ సింధూర్‌తో భారత ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. మన అధునాతన ఆయుధాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అయితే తాజాగా ఇండియన్ ఆర్మీలో ISTAR అనే మరో అధునాతన అస్త్రం చేరబోతోంది.
03:00 PM (IST) Jul 08
BMW గ్రూప్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా, సీఈఓగా హర్దీప్ సింగ్ బ్రార్ నియమితులయ్యారు. ఈ బాధ్యతలు ఆయన 2025 సెప్టెంబర్ 1 నుంచి చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ హర్దీప్ సింగ్ ఎవరు.? ఆయన నేపథ్యం ఏంటో తెలుసుకుందాం.
02:34 PM (IST) Jul 08
రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోతే అధికారులు చలాన్లు విధిస్తారనే విషయం తెలిసిందే. అయితే చాలా మంది నిర్లక్ష్యంతో చలాన్లు చెల్లించరు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
02:32 PM (IST) Jul 08
ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్ సర్వీస్ నడవనుంది… గురుపౌర్ణమిలోగా తిరువణ్ణామలై చేరుకుని గిరి ప్రదక్షిణ చేయాలనుకునే తెలుగువారి కోసమే ఈ బస్ నడుపుతోంది తెలంగాణ ఆర్టిసి. ఇక IRCTC కూడా ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది.
12:30 PM (IST) Jul 08
జులై 9 బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ఉంటుందా? ఆర్టిసి, స్కూల్ బస్సులు నడుస్తాయా? బ్యాంకుల సంగతి ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
12:07 PM (IST) Jul 08
కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. స్వామి వారి రూపాన్ని ఒక్క క్షణం చూసేందుకు గంటల పాటు ప్రయణించి తిరుమలకు చేరుకుంటారు. వెంకన్నను దగ్గరి నుంచి దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు.
11:17 AM (IST) Jul 08
సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ చరిత్రను మార్చిన పేరు. ఆయన బ్యాటింగ్‌లో ఆత్మవిశ్వాసం, నాయకత్వంలో ధైర్యం, జట్టులో కొత్త ప్రాణం పోసిన గొప్ప కెప్టెన్. క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న గంగూలీ పుట్టిన రోజు నేడు.
10:43 AM (IST) Jul 08
సరస్వతి పవర్ నుంచి భారతి సిమెంట్ వరకు... వైఎస్సార్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు అనేక వ్యాపారసంస్థలు స్థాపించారు. ఇలా రాజకీయ నాయకుడిగానే కాదు వ్యాపారవేత్తగా కూడా సక్సెస్ అయ్యారు వైఎస్సార్. ఆయన చేసిన వ్యాపారాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
10:28 AM (IST) Jul 08
ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత పెన్షన్ వస్తుందనే విషయం తెలిసిందే. అయితే అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి ఇలాంటి సదుపాయం ఉండదు కదా. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం
08:05 AM (IST) Jul 08
తెలంగాణలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆయా జిల్లాలకు క్లౌడ్ బరస్ట్ భయం పట్టుకుంది… అంటే కుంభవృష్టి ఉంటుందేమోనని భావిస్తున్నారు.