- Home
- Sports
- Cricket
- Indian cricketers love stories: బాలీవుడ్ ప్రేమలో క్లీన్ బౌల్డ్ అయిన టాప్-5 భారత క్రికెటర్లు !
Indian cricketers love stories: బాలీవుడ్ ప్రేమలో క్లీన్ బౌల్డ్ అయిన టాప్-5 భారత క్రికెటర్లు !
Indian cricketers Bollywood love stories: పలువురు భారత క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమల వల్ల తమ ఆటపై పట్టును కోల్పోయారని తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. వారిలో విరాట్ కోహ్లీ, యూవరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు.

బాలీవుడ్ అందగత్తెల చేతిలో క్లీన్ బౌల్డ్ అయిన భారత ప్లేయర్లు
Indian cricketers Bollywood love stories: భారత క్రికెట్‌లో ఆటతో పాటు గాసిప్‌లకు కూడా కొదవలేదు. బాలీవుడ్ హీరోయిన్లతో ఉన్న సంబంధాల వల్ల క్రికెటర్ల ఆటపై ప్రభావం చూపిందన్న ఆరోపణలు చాలానే వినిపించాయి. అయితే, వీటికి తగిన ఆధారాలులేవు కానీ, వీరి లవ్ స్టోరీలు మాత్రం బాలీవుడ్ క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచాయి.
బాలీవుడ్ హీరోయిన్లతో క్రికెటర్ల ప్రేమాయణంపై రూమర్లు చాలానే వచ్చాయి. టీమిండియా దిగ్గజాలు సౌరవ్ గంగూలీ నుంచి విరాట్ కోహ్లీ వరకు.. టాప్ 5 క్రికెటర్ల బాలీవుడ్ లవ్ స్టోరీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి - షర్మిలా ఠాగూర్
1965లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ లు ఒక దోస్తు ద్వారా కలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారనే వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. నాలుగేళ్ల ప్రేమ అనంతరం 1969లో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో క్రికెటర్ల భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్ మ్యాచ్‌లకు వెళ్లడానికి అనుమతి ఉండేది కాదు. అయినా షర్మిలా తన భర్తతో కలిసి ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లడం విశేషం.
షర్మిలా ఠాగూర్ వారి లవ్ స్టోరీపై.. “ఒకటి లేదా రెండు సందర్భాల్లో ఆయన క్రికెట్ లో రాణించకపోవడానికి నేను కారణమనే అభిప్రాయం వినిపించింది. నటులు లేదా ప్రముఖ నేపథ్యం కలిగిన వ్యక్తుల్ని తప్పుగా చూపించడం చాలా తేలీక” అని మండిపడ్డారు.
2. యువరాజ్ సింగ్ - దీపికా
యువరాజ్ సింగ్ తన దూకుడైన ఆటతీరు, సిక్సర్ల మోత మోగించే బ్యాటింగ్ శైలితో క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. 2008లో ఆస్ట్రేలియా టూర్ సమయంలో యూవీ, దీపికా పదుకోణే కలసి కనిపించారన్న వార్తలు బయటకొచ్చాయి. ఆ సిరీస్‌లో యూవీ ప్రదర్శన నిరాశ కలిగించగా, కొంతమంది దీపికాను కారణంగా భావించారు. వారి ప్రేమలో ఉన్నారనే రూమర్లు వినిపించాయి. అయితే, కొంతకాలం తర్వాత యువరాజ్ బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్నారు. 2022లో యూవీ తండ్రయ్యారు.
3. సౌరవ్ గంగూలీ - నగ్మా
1990ల చివర్లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ప్రముఖ సినీ నటి నగ్మా మధ్య సంబంధాల గురించి ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వీరు ప్రేమలో ఉన్నారనీ, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ రూమర్లు గంగూలీ వివాహం చేసుకున్న తర్వాత వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. గంగూలీ ఈ ప్రేమాయణంపై స్పష్టత ఇవ్వలేదు.. కానీ, నగ్మా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు ప్రస్తావించారు.
"ఎవరు ఏమన్నా పర్లేదు, మనం ఒకరినొకరు గుర్తుంచుకోవడం మానలేదు. జీవితంలో కొన్ని నిర్ణయాలు అవసరమవుతాయి" అని దాదా పేరు చెప్పకుండా పేర్కొన్నారు. కాగా, దాదా లవ్ రూమర్లపై గంగూలీ భార్య డోనా తీవ్రంగా స్పందించారు. కొన్ని పత్రికలు కుట్రపూరితంగా వ్యవహరించాయని విమర్శించారు.
4. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ
ఇప్పటికీ క్రికెట్-బాలీవుడ్ జంటల్లో టాప్ లో కనిపించేది విరాట్-అనుష్కలు. వీరి ప్రేమ కూడా విమర్శలకు గురైంది. 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్లో విరాట్ తక్కువ స్కోరు చేయగా, కొంతమంది అభిమానులు అనుష్కను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. కొంతకాలం తర్వాత వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2017లో పెళ్లి చేసుకోగా, 2021లో కుమార్తె వామికను స్వాగతించారు. అలాగే, వారికి ఒక బాబు కూడా పుట్టాడు.
5. మహమ్మద్ అజహరుద్దీన్ - సంగీతా బిజ్లానీ
1980 మిస్ ఇండియా విజేత సంగీతా బిజ్లానీ, మాజీ స్టార్ క్రికెటర్ అజహరుద్దీన్ ప్రేమలో పడ్డారు. 1996లో పెళ్లి చేసుకున్నారు. కానీ 2000లో వీరు విడిపోయారు. 1996 వరల్డ్ కప్ సెమీఫైనల్ సమయంలో సంగీతా అజహర్‌కి తోడుగా స్టేడియంలో కనిపించారు. అయితే, అజహర్ ఆటతీరు నిరాశపర్చడంతో సంగీతాను అభిమానులు టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
మొత్తంగా క్రికెట్ బాలీవుడ్ లవ్ స్టోరీలు కొన్ని విజయవంతంగా కొనసాగుతుండగా, మరికొన్ని మధ్యలోనే ముగిశాయి.