MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • RCB: ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్.. ఐపీఎల్ తోపు టీమ్ గా కోహ్లీ ఆర్సీబీ జట్టు

RCB: ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్.. ఐపీఎల్ తోపు టీమ్ గా కోహ్లీ ఆర్సీబీ జట్టు

RCB: విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన తర్వాత అత్యధిక బ్రాండ్ విలువను సాధించింది. ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)‌ను అధిగమించి తొలి స్థానంలోకి చేరింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 08 2025, 11:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారీగా పెరిగిన ఐపీఎల్‌ బ్రాండ్ విలువ
Image Credit : ANI

భారీగా పెరిగిన ఐపీఎల్‌ బ్రాండ్ విలువ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో, లీగ్‌ మొత్తం వ్యాపార విలువ 12.9% వృద్ధితో $18.5 బిలియన్లకు చేరుకుంది. అంతేకాకుండా, స్వతంత్ర బ్రాండ్ విలువ 13.8% పెరిగి $3.9 బిలియన్లకు చేరిందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హూలిహాన్ లోకీ (Houlihan Lokey) తాజా నివేదిక తెలిపింది. రికార్డ్ స్థాయిలో వ్యూయర్‌షిప్, ప్రకటనల ఆదాయ వృద్ధి ఇందుకు కారణాలుగా పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సీఎస్‌కేను అధిగమించిన ఆర్సీబీ
Image Credit : ANI

సీఎస్‌కేను అధిగమించిన ఆర్సీబీ

ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను 2025లో గెలుచుకుంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను అధిగమించి అత్యధిక బ్రాండ్ విలువ గల జట్టుగా అవతరించింది. 2024లో $227 మిలియన్లుగా ఉన్న ఆర్సీబీ బ్రాండ్ విలువ, ఈ ఏడాది $269 మిలియన్లకు పెరిగింది. ముంబై ఇండియన్స్ (MI) రెండో స్థానానికి చేరుకోగా, CSK మూడో స్థానానికి పడిపోయింది. CSK బ్రాండ్ విలువ కేవలం స్వల్పంగా పెరిగి $231 మిలియన్ల నుంచి $235 మిలియన్లకు చేరింది.

36
పంజాబ్ కింగ్స్‌ బ్రాండ్ విలువ భారీగా పెరిగింది
Image Credit : IPL MEDIA

పంజాబ్ కింగ్స్‌ బ్రాండ్ విలువ భారీగా పెరిగింది

పంజాబ్ కింగ్స్ (PBKS) బ్రాండ్ విలువలో 39.6% వృద్ధిని నమోదు చేసింది. గతేడాది $101 మిలియన్లుగా ఉన్న విలువ, ఈ ఏడాది $141 మిలియన్లకు చేరింది. దీనికి ప్రధాన కారణం రన్నరప్ గా నిలవడం, ఆగ్రెసివ్ ఆటగాళ్ల వేలం వ్యూహం, డిజిటల్ ప్రచారాల ప్రభావం ఉన్నాయని నివేదిక పేర్కొంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా 34% వృద్ధితో తరువాతి స్థానంలో నిలిచింది.

46
ఐపీఎల్ వాణిజ్యం: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు
Image Credit : RCB MI CSK X Account

ఐపీఎల్ వాణిజ్యం: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు

హూలిహాన్ లోకీ నివేదిక ప్రకారం, ఐపీఎల్ ప్రత్యేకత తక్కువ మూలధనంతో, స్థిరమైన నగదు ప్రవాహాలు కలగలిపిన వ్యాపార నమూనాలో ఉంది. జట్లకు వచ్చే ఆదాయాల్లో ప్రధానంగా బీసీసీఐ నిర్వహించే మీడియా, స్పాన్సర్‌షిప్ ఒప్పందాల ద్వారా ముందుగానే ఆదాయం విలువ తెలుస్తుంది. బీసీసీఐ ఆధ్వర్యంలోని స్టేడియంలు, రూ.120 కోట్ల జీతాల పరిమితి వంటి కారకాలు, జట్లకు అధిక పెట్టుబడులు లేని లాభదాయకతను అందిస్తున్నాయి.

56
ఐపీఎల్ ప్రకటనల ఆదాయాల్లో విప్లవాత్మక వృద్ధి
Image Credit : ANI

ఐపీఎల్ ప్రకటనల ఆదాయాల్లో విప్లవాత్మక వృద్ధి

2025 ఐపీఎల్ సీజన్‌లో ప్రకటనల ఆదాయాలు $600 మిలియన్ల (సుమారు రూ.5,000 కోట్లు)ను దాటి, గత ఏడాదితో పోలిస్తే 50% పెరిగాయి. బీసీసీఐ అమ్మిన నాలుగు అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌ డీల్స్.. మై11సర్కిల్, ఏంజెల్ వన్, రూపే, సీఏటీతో కలిపి రూ.1,485 కోట్లు సంపాదించింది. టాటా గ్రూప్ ఐదు సంవత్సరాల పాటు టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను రూ.2,500 కోట్ల ఒప్పందంతో 2028 వరకు కొనసాగించనుంది.

66
ఐపీఎల్ లో రికార్డు వ్యూయర్‌షిప్: ఆర్సీబీ-పంజాబ్ ఫైనల్‌ చరిత్ర సృష్టించింది
Image Credit : ANI

ఐపీఎల్ లో రికార్డు వ్యూయర్‌షిప్: ఆర్సీబీ-పంజాబ్ ఫైనల్‌ చరిత్ర సృష్టించింది

ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా కొంతకాలం నిలిపివేశారు. అయినా చివరికి అత్యధిక వ్యూయర్‌షిప్‌తో ముగిసింది. మార్చి 22-24 మధ్య జరిగిన ఓపెనింగ్ వీకెండ్‌లో JioHotstar 1.37 బిలియన్ వ్యూస్ నమోదు చేసింది. 340 మిలియన్ రియల్ టైమ్ వీక్షకులు ఉన్నారు. స్టార్ స్పోర్ట్స్‌ 253 మిలియన్ ప్రత్యేక టీవీ వీక్షకులను ఆకర్షించింది. మొత్తం వాచ్‌టైమ్ 49.5 బిలియన్ నిమిషాలుగా నమోదైంది.

జూన్ 3న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్‌ను ఓడించగా, ఈ మ్యాచ్‌ JioHotstar‌లో 678 మిలియన్లకు పైగా వ్యూస్‌ను నమోదు చేసి, ఇప్పటివరకు టీవీ లేదా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రసారమైన అత్యధిక వీక్షణ కలిగిన T20 క్రికెట్ మ్యాచ్‌గా నిలిచింది. ఇదే సంవత్సరం జరిగిన ఇండియా-పాకిస్తాన్ ఐసీసీ మ్యాచ్‌ను కూడా ఇది అధిగమించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
విరాట్ కోహ్లీ
బెంగళూరు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
Team india: లార్డ్స్‌లో ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్న భారత బౌలర్లు
Recommended image2
India vs England: లార్డ్స్ లో భారత్ vs ఇంగ్లాండ్ హోరాహోరీ.. ఎక్కడ ఫ్రీగా లైవ్ చూడొచ్చు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved