MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Indian Air Force: రూ. 10 వేల కోట్ల భారీ డీల్.. అత్యాధునిక విమానాలు కొనుగోలు చేయ‌నున్న ఇండియ‌న్ ఆర్మీ

Indian Air Force: రూ. 10 వేల కోట్ల భారీ డీల్.. అత్యాధునిక విమానాలు కొనుగోలు చేయ‌నున్న ఇండియ‌న్ ఆర్మీ

ఆప‌రేష‌న్ సింధూర్‌తో భార‌త ఆర్మీ స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. మ‌న అధునాత‌న ఆయుధాల‌ను చూసి ప్ర‌పంచ‌మే ఆశ్చ‌ర్య‌పోయింది. అయితే తాజాగా ఇండియ‌న్ ఆర్మీలో ISTAR అనే మ‌రో అధునాత‌న అస్త్రం చేర‌బోతోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 08 2025, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ISTAR అంటే ఏంటి.?
Image Credit : Asianet News

ISTAR అంటే ఏంటి.?

ISTAR అంటే Intelligence, Surveillance, Target Acquisition and Reconnaissance. అంటే శత్రు కదలికలను గమనించడం, విశ్లేషించడం, లక్ష్యాలను గుర్తించడం, డేటాను తక్షణమే అందించడం వంటి పనులను ఒకే విమానం చేస్తుంది.

25
భారత వాయుసేనకు 3 ISTAR జెట్‌లు
Image Credit : Asianet News

భారత వాయుసేనకు 3 ISTAR జెట్‌లు

భారత రక్షణ శాఖ రూ. 10,000 కోట్లు ఖర్చుతో మూడు అధునాతన ISTAR విమానాలను కొనుగోలు చేయనుంది. ఇవి సాధారణ నిఘా విమానాల కంటే ఎంతో శక్తివంతమైనవి. అవి శత్రు ప్రాంతాలను గమనించడమే కాకుండా, దాడులకు ప్రణాళిక రూపొందించడంలోనూ ఉపయోగపడతాయి.

Related Articles

Related image1
ATM: కార్డు లేకుండానే డ‌బ్బులు తీసుకోవ‌చ్చు.. దేశంలో కొత్త ఏటీఎమ్‌లు వ‌చ్చేశాయ్
Related image2
Tirumala: తిరుమ‌ల శ్రీవారిని మొద‌టి గ‌డ‌ప నుంచి ద‌ర్శించుకునే అవ‌కాశం.. ఏం చేయాలంటే.?
35
వీటి ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే.?
Image Credit : Asianet News

వీటి ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే.?

ఈ విమానాల్లో రాడార్లు, హై-రిసల్యూషన్ కెమెరాలు, AI ఆధారిత సెన్సార్‌లు ఉంటాయి. ఇవి చీక‌టిలో, మేఘాల మధ్యలోనూ శత్రు కదలికలను పసిగట్టగలవు.

ISTAR విమానాలు సేకరించిన సమాచారం తక్షణమే విశ్లేషించి, భూమిపై ఉన్న ఆర్మీ, నేవీ, వాయుసేన యూనిట్లకు పంపిస్తాయి. దాంతో వేగంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

45
ఈ విమానాలతో అవ‌స‌రం ఏంటి.?
Image Credit : Asianet News

ఈ విమానాలతో అవ‌స‌రం ఏంటి.?

బాలాకోట్, LAC ఘటనల అనంతరం మౌలిక లోపాలు బయటపడ్డాయి. సరిగ్గా సమయానికి నిఘా సమాచారం అందకపోవడం వల్ల సమస్యలు వచ్చాయనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ ISTAR ద్వారా శత్రు కదలికలపై ముందుగానే సమాచారం అందిస్తాయి. స్మార్ట్ మిస్సైల్ దాడులకు గైడెన్స్‌గా ప‌నిచేస్తుంది. శ‌త్రు దేశాల ప్రాంతాల్లోకి వెళ్లకుండానే మన భద్రతను బ‌లోపేతం చేయొచ్చు.

55
మేక్ ఇన్ ఇండియా నినాదం
Image Credit : Asianet News

మేక్ ఇన్ ఇండియా నినాదం

ఈ ISTAR విమానాలు బోయింగ్ లేదా బాంబార్డియర్ వంటి విదేశీ కంపెనీల నుంచైనా, వాటిలో ఉపయోగించే ప్రధాన సెన్సార్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు DRDO తయారు చేయబోతోంది. ఇలా వీటి త‌యారీలో భార‌త్ కూడా భాగ‌స్వామ్య‌మ‌వుతోంది.

స‌వాళ్లు కూడా పొంచి ఉన్నాయి

అయితే ఈ విమానాల ఉప‌యోగంలో కొన్ని స‌వాళ్లు కూడా పొంచి ఉన్నాయి. అధునాతన డేటా వ్యవస్థలకు రక్షణ కోసం సైబర్ సెక్యూరిటీ ప‌టిష్టంగా ఉండాలి. టెక్నాలజీతో పాటు వ్యూహాన్ని అర్థం చేసుకునే అనలిస్టులు పెద్ద ఎత్తున అవ‌స‌ర‌మ‌వుతారు. మొత్తం మీద ఈ విమానాల‌తో శత్రుపై ముందస్తు విజయం సాధించ‌వ‌చ్చు. అధునాతన నిఘా సామర్థ్యం సొంతమ‌వుతుంది. ఇది దేశీయ రక్షణ పరిశ్రమకు పెద్ద పురోగతిగా చెప్పొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
రక్షణ (Rakshana)
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image3
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Related Stories
Recommended image1
ATM: కార్డు లేకుండానే డ‌బ్బులు తీసుకోవ‌చ్చు.. దేశంలో కొత్త ఏటీఎమ్‌లు వ‌చ్చేశాయ్
Recommended image2
Tirumala: తిరుమ‌ల శ్రీవారిని మొద‌టి గ‌డ‌ప నుంచి ద‌ర్శించుకునే అవ‌కాశం.. ఏం చేయాలంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved